Baby Sale Case: నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం తండాలో ఇటీవల శిశువును తల్లిదండ్రులు మధ్యవర్తుల ద్వారా ఆంధ్రప్రదేశ్(AP) కు చెందిన వారికి విక్రయించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విక్రయ సమయంలో బాధిత శిశు ఇద్దరు అక్కలు చెల్లెల్ని విక్రయించొద్దంటూ తల్లిదండ్రులను వేడుకున్నారు. దీంతో కనుకరించని తల్లిదండ్రులు కొర్ర బాబు(Korra Babu), స్వాతి(swathi) పది రోజుల ఆడ శిశువును అమ్మేశారు. మొత్తం నలుగురు ఆడ సంతానం కాగా, అప్పటికే మూడో సంతానాన్ని కూడా విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మధ్యవర్తుల ద్వారా ఆంధ్రప్రదేశ్(AP) గుంటూరు(Gunturu) జిల్లాకు చెందిన వారికి శిశువును రూ.3 లక్షలకు విక్రయించినట్లుగా తెలుస్తోంది.
సూపర్వైజర్ ఫిర్యాదుతో కేసు నమోదు
నవజాత శిశువును కనికరించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారికి విక్రయించిన తల్లిదండ్రుల విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ నోట ఈ నోట ఐసిడిఎస్(IDS) అధికారుల వరకు వెళ్లింది. దీంతో తల్లిదండ్రులను నిలదీసిన ఐసిడిఎస్ అధికారులు ఆ తర్వాత నల్లగొండ(Nalgonda) 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువును అందిన తల్లిదండ్రులు, కొనుగోలు చేసిన వ్యక్తులు, మధ్యవర్తిథ్యం చేసిన వారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కనికరించని తల్లిదండ్రులు
మూడో సంతానాన్ని విక్రయించినప్పుడు ఆ ఇద్దరు కూతుళ్లు చిన్నవారు. ఆ తర్వాత నాలుగో సంతానంగా జన్మించిన నవజాత శిశువును విక్రయించే సమయంలో తమ చెల్లిని అమ్ముద్దని ఆ తల్లిదండ్రుల ఇద్దరు పెద్ద కూతుర్లు వారి కాళ్ళ మీద పడి వేడుకున్నారు. అయినప్పటికీ స్పందించని తల్లిదండ్రులు విక్రయానికి ముగ్గు చూపారు. దీంతో ఆ ఇద్దరు కూతుర్లు ఏడ్చిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి.
Also Read: Suryapet News: ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలి: ఎస్పీ నరసింహ
మంత్రి సీతక్క సీరియస్..
నల్లగొండ జిల్లా తిరుమలగిరి(Thirumalagiri) సాగర్ మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన గిరిజన దంపతులు నాలుగవ సంతానాన్ని విక్రయించిన ఘటనపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీ(Minister Seethakka)తక్క సీరియస్ అయ్యారు. విక్రయాలు జరిపిన తల్లిదండ్రులు, మధ్యవర్తిత్వం చేసిన వ్యక్తులు, కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు శిశువును కొనుగోలు చేసిన వారికోసం గాలిస్తున్నారు.
విక్రయానికి గల కారణాలు
నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం తెల్లాపురం గ్రామానికి చెందిన కుర్ర బాబు(babu) స్వాతి(swathi) దంపతులకు తొలుత ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ఆ తర్వాత కూడా మరో కూతురు జన్మించింది. ఆ శిశువును కూడా విక్రయం జరిపారు. మళ్లీ గర్భం దాల్చిన నాలుగో సంతానంలో కూడా ఆడ కూతురే జన్మించింది. దీంతో పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో మగ పిల్లలపై మమకారంతో నాలుగో సంతానంగా పుట్టిన పది రోజుల శిశువును కూడా అమ్మేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది.
నల్లగొండ జిల్లాలో గతంలోనూ శిశు విక్రయాలు
నల్లగొండ జిల్లాలోని పేద, గిరిజన తండాలను లక్ష్యంగా చేసుకుని దళారులు శిశు విక్రయాలకు పాల్పడుతున్న ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. తిరుమలగిరి సాగర్ మండలం గ్రామానికి చెందిన ఆంగోతు సేవ, జ్యోతి దంపతులకు మూడవ సంతానంగా జన్మించిన ఆడ శిశువును కూడా 2024 జనవరిలో విక్రయించారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపర్ సహాయంతో సంతానం లేని మరో దంపతులకు శిశువును రూ.1.5 లక్షలకు విక్రయించారు. ఈ విషయం మూడు నెలల తర్వాత అంగన్వాడీ టీచర్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా 2015 జాతీయ మీడియా ఛానల్ నల్లగొండ జిల్లాలో కొన్ని వేల రూపాయలకు ఆడపిల్లలను విక్రయిస్తున్నట్లు స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆడపిల్లలను పెంచే స్తోమత లేక మగ పిల్లల కోసం ఆశించడం వంటి కారణాలతో పేద తల్లిదండ్రులు తమ బిడ్డలను విక్రయిస్తున్నారని ఆ నివేదిక తేల్చింది. ఆ నివేదిక ఆధారంగా నల్గొండ జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ కేసుల్లో ప్రధాన నిందితు రాలుగా భావించిన కమలి అనే బ్రోకర్ ను పోలీసులు అరెస్టు చేసి చట్టరీత్య చర్యలు తీసుకున్నారు.
గతంలో శిశు విక్రయాల ముఠాల అరెస్ట్
నల్లగొండ జిల్లా కేంద్రంగా గతంలో పలు అంతర్రాష్ట్ర శిశు విక్రయాల ముఠాలను కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గుజరాత్(Gujarath), మహారాష్ట్రాల(maharasta) నుండి శిశువులను కొనుగోలు చేసి తెలంగాణ(Telangana)లోని సంతానం లేని దంపతులకు అధిక ధరకు విక్రయించినట్లు గతంలోనూ నల్లగొండ జిల్లాలో కేసులు నమోదయ్యాయి. పేదరికం, ఆడపిల్లల పట్ల వివక్ష, శిశు విక్రయాలను ప్రోత్సహించే దళారుల వ్యవస్థతో ఇప్పటికీ శిశు విక్రయాల దందా నడుస్తోంది.
Also Read: Jubilee Hills By-Election: చిన్న శ్రీశైలం యాదవ్ బైండోవర్.. మరో 100 మందికి పైగా రౌడీషీటర్లు కూడా!
