MLA Murali Naik: గత పది ఏండ్ల కాలం నుండి ఇనుగుర్తి మండల అభివృద్ధి పనులు శూన్యం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇనుగుర్తి మండల అభివృద్ధి జరుగుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ (MLA Murali Naik) అన్నారు. గురువారం ఇనుగుర్తి టౌన్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తమ్మడపల్లి గెలుపుకై గురువారం సాయంత్రం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా .మురళి నాయక్ మాట్లాడుతూ.. గత పది ఏళ్ల కాలంలో టిఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా ఇనుగుర్తి మండల అభివృద్ధి జరుపలేదని విమర్శించారు.
Also Read: Errabelli Gudem Farmers: ఎర్రబెల్లి గూడెం గ్రామానికి ఎస్సారెస్పీ కాలువ వచ్చేనా?
నూతనంగా రేషన్ కార్డులు
త్వరలోనే మండల కేంద్రంలో ఏటీసీ సెంటర్ను ప్రారంభిస్తామని మండల ప్రజలకు తెలిపారు. ఇనుగుర్తి గ్రామానికి అర్హులైన నిరుపేదలకు 85 ఇందిరమ్మ ఇండ్లను అందించామని, నూతనంగా రేషన్ కార్డులు, ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మండలం అభివృద్ధిపై అడుగులు వేయాలంటే మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తమ్మడపల్లి కుమార్ ను గెలిపించాలని వారితో పాటు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు డా.భూక్యఉమా, కేసముద్రం ఏఎంసి డైరెక్టర్ కొట్టం రాము, మండల అధ్యక్షుడు కురెళ్ళి సతీష్, టౌన్ అధ్యక్షుడు గంజి రాజేందర్ రెడ్డి, జిల్లా నాయకులు బైరు అశోక్ గౌడ్, చిన్నాలకట్టయ్య, మహిళ అధ్యక్షురాలు ఓర్రె కవిత, టౌన్ ప్రధాన కార్యదర్శి వల్లముల మురళి, గంజి శ్రీనివాస్, గట్టిగొర్ల సందీప్, ఖలీల్, వెంకన్న, రమేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Also Read: MLA Murali Naik: విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎమ్మెల్యే మురళీ నాయక్

