Bhatti Vikramarka: మున్సిపాలిటీ ఎన్నికల్లోను అత్యధిక స్థానాలను గెలుచుకుని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పేర్కొన్నారు. మధిరలో పర్యటించిన డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేలు అందరూ మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఇప్పటికే నగరాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశామని, మరిన్ని మున్సిపాలిటీ చైర్మన్ పీఠాలను గెలుచుకొని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
Also Read: Bhatti Vikramarka: సింగరేణిపై కట్టుకథలు.. ఏ గద్దల్ని వాలనివ్వను.. భట్టి విక్రమార్క ఫైర్
దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు
మహేష్ గౌడ్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మా క్యాబినెట్ అంతా ఉమ్మడి కుటుంబంలో పనిచేస్తుందని, రాష్ట్ర భవిష్యత్తు మా అందరి లక్ష్యమని పేర్కొన్నారు. ప్యూర్, క్యూర్, రేర్ సమగ్ర విధానంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం 2017 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేశంలో లేరు కాబట్టి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాకు కొన్ని సూచనలు చేశారు. మంత్రులు వారి సమస్యలు, ఆ విషయాలను ముఖ్యమంత్రికి నేను వివరించానన్నారు. ప్రజాభవన్లో మంత్రుల భేటీపై కొందరు పిచ్చి భ్రమల్లో ఉండి పిచ్చి రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు డిప్యూటీ సీఎంను కలవకపోతే రాసే వారితో చూపించే వారితో కలుస్తారా? అంటూ ప్రశ్నించారు.
Also Read: Bhatti Vikramarka: అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు… డిప్యూటీ సీఎం భట్టి స్పష్టత

