Vllabhaneni Vamshi
విశాఖపట్నం

Vllabhaneni Vamshi : ముగిసిన వల్లభనేని వంశీ కస్టడీ.. ఏం చెప్పాడో తెలుసా..?

Vllabhaneni Vamshi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ ముగిసింది. పోలీసులు వంశీని మూడు రోజుల పాట కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. పటమట పోలీసులు ఆయన్ను మూడు రోజుల పాటు విచారించారు. విచారణ ముగియడంతో ఆయన్ను జీజీహెచ్ కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. వంశీతో పాటు శివరామకృష్ణ, లక్ష్మీపతిలను కూడా పోలీసులు ప్రశ్నించారు.

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని ప్రశ్నించారు. పోలీసులు ఎన్ని ప్రశ్నలు వేసినా తనకు తెలియదు అని వంశీ పదే పదే చెప్పినట్టు తెలుస్తోంది. సరైన సమాధానాలు రాకపోవడంతో మరోసారి కస్టడీకి కోరే అవకాశాలు ఉన్నాయి. ఇంకోవైపు వైసీపీ (ycp) పార్టీ ఇదే కేసుపై ట్రూత్ బాంబ్ పేరుతో సంచలన వీడియోలను కూడా రిలీజ్ చేస్తోంది. వంశీకి అటు కోర్టుల్లో కూడా వరుస షాకులు తగులుతున్నాయి. ముందస్తు బెయిల్ రద్దు కావడమే కాకుండా ఇతర పిటిషన్లను కూడా కోర్టు కొట్టేసింది.

 

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం