Madhurawada Crime: ఆంధ్రలో జరిగిన ఓ విషాదకర ఘటన కంట తడి పెట్టిస్తోంది. ప్రియుడును ప్రేమించడం లేదనే కోపంతో ప్రియురాలి కుటుంబంపై ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి దాడి చేశాడు. కొంచం కూడా కనికరం లేకుండా తల్లీ, కూతురుపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటన మధురవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Also Read: MLC Balmuri venkat: మైమ్ హో మ్ పై బీజేపీ, బీఆర్ఎస్ ప్రేమ ఎందుకు..?కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రశ్న?
మధురవాడలో రెంటుకు ఉంటున్న నవీన్ అనే ఓ వ్యక్తి కొమ్మాది స్వయం కృషి నగర్లో ఉంటున్న దివ్య అనే అమ్మాయి తనను లవ్ చేయాలని కొంతకాలం నుంచి ఆమెను వేధిస్తున్నాడు. దీనికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో ఆమెపై కక్ష్య పెంచుకుని బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆ యువకుడు బాధితురాలు దీపిక ఇంట్లోకి చొరబడి యువతి, ఆమె తల్లిపై కిరాతంగా కత్తితో దాడి చేసి పారి పోయాడు.
Also Read: BRS Leader Meet Rammohan Naidu: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో బీఆర్ఎస్ ఎంపీలు భేటి.. ఎందుకంటే?
కూతురుతో గొడవ పడుతుండగా.. అది విన్న తల్లి లక్ష్మి అతన్ని ఆపేందుకు మధ్యలో వెళ్ళగా .. ఆమె మీద కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి లక్ష్మి(43) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ కేకలు విని ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులను కూడా నవీన్ బెదిరించాడు. సమాచారం అందిన పోలీసులు అక్కడికి చేరుకొని, దీపికను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మధ్యలోనే మరణించింది. ఇంతటి దారుణానికి పాల్పడిన నవీన్ మీద కేసు నమోదు పోలీసులు, అతని కోసం గాలిస్తున్నారు.
మధురవాడ ప్రేమోన్మాది ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత
విశాఖ నగర పోలీస్ కమీషనర్ శంకబ్రత బాగ్చీతో ఫోన్ లో మాట్లాడిన హోంమంత్రి అనిత. బాధితురాలు నక్క దివ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన హోంమంత్రి. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. ప్రేమోన్మాదిని త్వరగా గాలించి పట్టుకుని, కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దివ్య తల్లి లక్ష్మి మృతిపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.