రథసప్తమి నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి (Arasavalli)లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక్కడి సూర్యభగవానుని ఆలయానికి ఉన్న ప్రత్యేకత నేపథ్యంలో ఈ వేడుకను రాష్ట్ర పండుగగా జరపాలని ఇటీవలే జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అరసవల్లి ఆలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. అర్థరాత్రి నుంచే సూర్య భగవానుడి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వినయ్ చంద్ పట్టు వస్త్రాలను సమర్పించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు నిజరూప దర్శనం కల్పించారు. అరసవల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్షీరాభిషేకం కోసం భక్తులు బారులు తీరారు. ఆదిత్యుడి దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు.