lokal Boi Nani
విశాఖపట్నం

lokal Boi Nani : లోకల్ బాయ్ నాని అరెస్ట్.. క్రిమినల్ కేసు నమోదు..!

lokal Boi Nani : యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు విశాఖ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కొన్ని రోజుల కింద నాని తన యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ వీడియోలు చేశాడు. ఆ వీడియోలపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (sajjanar) సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న నాని మీద యాక్షన్ తీసుకోవాలంటూ ఏపీ డీజీపీ (ap dgp) హరీష్​ రావును ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేస్తూ కోరారు.

దీంతో ఏపీ పోలీసులు నానిని అరెస్ట్ చేశారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా మొన్ననే లోకల్ బాయ్ స్పందిస్తూ.. సజ్జనార్ కు క్షమాపణలు కూడా చెప్పాడు. తాను చదువుకోలేదని.. అందుకే ఇలాంటి తప్పు చేశానని చెప్పుకొచ్చాడు. తనలాగా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

 

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం