Ganta Srinivasa Rao tweet: ఏపీ టిడిపి ఎమ్మెల్యే ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సెగ నేరుగా కేంద్ర పౌర విమానయాన శాఖ తాకిందని చెప్పవచ్చు. అయితే ఆ ట్వీట్ లో ఆయన పడ్డ ఇబ్బందులు ఆ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరంటే విశాఖపట్టణానికి చెందిన గంటా శ్రీనివాసరావు. ఈయన మాజీ మంత్రి కూడాను. ఈయన చేసిన ఆ ట్వీట్ ఏమిటంటే..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సాయంత్రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. అయితే ఈయన విశాఖ నుండి అమరావతికి రావాల్సి ఉంది. అందుకు విమానమెక్కారు. ఆ విమానం ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చి, మళ్లీ తెలంగాణ నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చింది. ఇక్కడే ఎమ్మెల్యే గంటాకు కోపమొచ్చింది.
మన రాష్ట్రంలో ఉన్న మరో ప్రాంతానికి వెళ్లడానికి మరో రాష్ట్రం వెళ్లాల్సి రావడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరమన్నారు. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన తాను, విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడి నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యిందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా తనలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారని తెలిపారు. విశాఖ – విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
Also Read: Ramakrishna on Pawan Kalyan: పవన్ సతీమణి తలనీలాల సమర్పణ.. నోరు జారిన రామకృష్ణ
దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చిందని, ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఏదైనా దేశం కాని దేశానికి వెళ్ళేటప్పుడు ఎదుర్కొనే సమస్య స్వంత రాష్ట్ర పర్యటనకు ఎదుర్కోవాల్సి రావడంతో ఎమ్మెల్యే గంటాకు కోపమొచ్చింది. మరీ ఈ ట్వీట్ కు విమానయాన శాఖ ఏమి రిప్లై ఇస్తుందో వేచిచూడాలి.
ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ..
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం..
ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి… pic.twitter.com/kDMWFyjs9I— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) April 15, 2025