AP DGP
ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం

ప్రతి క్రైమ్ కెమెరాలో రికార్డు కావాలి -ఏపీ డీజీపీ

గంజాయి ఎక్కడ దొరికినా మూలాలు మాత్రం ఉత్తరాంధ్ర ఏజెన్సీ లోనే ఉన్నాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గంజాయి సరఫరా నియంత్రించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఇచ్చిన సూచనల మేరకు అనే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా ఈగల్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, వాళ్లు పని ప్రారంభించారని చెప్పారు. గంజాయి రవాణా నియంత్రణకు చెక్ పోస్ట్ లను సైతం పెంచినట్లు డీజీపీ వెల్లడించారు.

ప్రతి క్రైమ్ రికార్డ్ అవ్వాలి… 

సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున పెరిగిందని డీజీపీ పేర్కొన్నారు. ఏపీలో అన్ని నేరాలు తగ్గినప్పటికీ సైబర్ క్రైమ్ లు పెరిగాయని వెల్లడించారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలన్న ఆలోచన చేస్తున్నామని చెప్పారు. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు, అవగాహన ద్వారా నియంత్రించాలి అనేది సైబర్ క్రైమ్ ముఖ్య సూత్రం అని డీజీపీ తెలిపారు. ప్రతి క్రైమ్ ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలి అన్నది తమ లక్ష్యం అని చెప్పిన డీజీపీ… దానికోసం రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల స్పాట్లు గుర్తించామన్నారు. మార్చి 31 నాటికి లక్ష కెమెరాలు పెట్టాలన్నది తమ ఆలోచన అని చెప్పారు. మూడేళ్ల తర్వాత ఈమధ్య 30మంది మావోయిస్టులు ఏపీ వైపు వచ్చారని, మావోయిస్టుల ఏరివేతకై పోలీస్ శాఖ సమర్ధవంతం పని చేస్తుందని తేల్చి చెప్పారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం