Ration Card | తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లను సోమవారం సాయంత్రం నుంచే మీ సేవ కేంద్రాల్లో స్టార్ట్ చేసింది. కాబట్టి ఎవరైనా రేషన్ కార్డు కావాలనుకుంటే వెళ్లి అప్లై చేసుకోవచ్చని తెలిపింది ప్రభుత్వం. కాగా ప్రజా పాలన సమయంలో లేదంటే కులగణన సమయంలో లేదంటే ప్రజావాణి కేంద్రాల్లో అప్లై చేసుకున్న వాళ్లు మీ సేవ కేంద్రాల్లో అప్లై చేయొద్దని సూచించింది. మీ సేవ కేంద్రాలకు ఒకేసారి వెళ్లొద్దని.. వెంటనే అప్లికేషన్లు అయిపోవంటూ చెప్పింది ప్రభుత్వం.
