bapu-ghat
Uncategorized

Bapu Ghat: బాపూ ఘాట్ లోని 222 ఎకరాల భూమిపై చిక్కుముడి..?  సర్కార్ ఆశలకు బ్రేకులు?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఫిబ్రవరి లో మూసీ పునరుజ్జీవనం పనులు ప్రారంభించాలని సర్కార్ పెట్టుకున్న టార్గెట్ కు అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పనులను తొలుత బాపూ ఘాట్ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం టాస్క్ పెట్టుకున్నది. ఇందుకు రక్షణ శాఖ పరిధిలోని 222 ఎకరాల భూమికి క్లియరెన్స్ ను కోరుతూ ప్రభుత్వం గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసింది. డిసెంబరు నుంచి కంటిన్యూగా కేంద్రానికి ప్రపోజల్ పంపిస్తున్నారు. ఒకటి రెండు సార్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా పీఎం మోడీ నుంచి కేంద్ర మంత్రుల వరకు అందరికీ రిప్రజేంటేషన్లూ ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పటికీ ఆ భూములపై రక్షణ శాఖ క్లియరెన్స్ ఇవ్వలేదు. మూడు నెలలుగా ఆ పంచాయితీ సాగుతూనే ఉన్నది. దీంతో తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పీఎం మోడీకి ప్రపోజల్ ఇచ్చారు. కానీ క్లియరెన్స్ కు ఎంత సమయం పడుతుందనేది ఉత్కంఠగానే మారింది. ప్రతి సారి సానుకూలంగా స్పందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, అప్రూవల్ ఇచ్చేందుకు ఎందుకు వెనకాడుతుందో అర్ధం కావడం లేదని కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. బాపూ ఘాట్ కు క్లియరెన్స్ లభిస్తే నే మూసీ పునరుజ్జీవన పనులు ప్రారంభమవుతాయని టీ కాంగ్ నేతలు చెప్తున్నారు. రాష్ట్ర సర్కార్ ఆశాలకు బ్రేకులు వేస్తున్న కేంద్రంపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపడం సరికాదంటూ విమర్శిస్తున్నారు.

ఈ ఏడాదిలోనే 90 శాతం వర్క్స్ ….?

ఇక ఇప్పటికే డీపీఆర్ ను పూర్తి చేసుకున్న సర్కార్ ..కేంద్రం క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నది. నాలుగు విడతల్లో మూసీ పునరుజ్జీవనాన్ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న సర్కార్, తొలి దశలో బాపూ ఘాట్ ను ఎంపిక చేసుకున్న ది. ఈ ఏడాదిలోనే బాపూఘాట్ పరిధిలో 90 శాతం పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత 55 కి.మీ పరిధిలో స్టేజ్ లు వారీగా మూసీ పునరుజ్జీవనం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో నదీ జలాలు శుద్ధితో పాటు వర్షపు నీటి నిర్వహణ, వృద్ధి, వరదల నియంత్ర వ్యవస్థ, ల్యాండ్ స్కేపింగ్ డెవలప్ ,మూసీ పరివాహక కారిడర్ లో రవాణా హబ్ లు, ఇన్ కమ్ జనరేట్ కోసం మూసీ చుట్టూ వ్యాపారాలు, షాప్స్, అవుట్ లెట్స్ , తదితరవి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అంతేగాక గాంధీ సిద్దాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం (మెడిటేషన్ విలేజ్), చేనేత ప్రచార కేంద్రం,ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం వంటివి నిర్మించనున్నారు.

కారణం ఇదేనా..?
మూసీ పునరుజ్జీవనం ద్వారా పేదల ఇళ్లు కూలిపోతున్నాయని గతంలో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్ లు రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు కూలగొట్టి, ఇతర ప్రాంతాలకు షిప్టు చేయాలంటే మార్కెట్ వాల్యుకు మూడు రెట్టు అధికంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైరింగ్ స్టేట్ చీఫ్​ ఏకంగా రాత్రి బస కూడా చేశారు. రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాతనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ మధ్య ఇది రాజకీయ విమర్శలకు కారణమైంది.దీంతోనే స్టేట్ పెట్టిన ప్రపోజల్ ను అప్రూవ్ చేసేందుకు కేంద్రం జాప్యం చేస్తున్నట్లు సమాచారం. పైగా తాము ప్రాజెక్టును మొదలు పెడితే, ప్రతిపక్షాలు ఉనికి కోల్పోతామనే భయంతో ఉన్నాయని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. భూ సేకరణ సంపూర్ణంగా పూర్తయితే పనులు స్పీడప్ అవుతాయని వివరిస్తున్నారు.

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు