Uncategorized

Pedda palli : ఈదురుగాలులకే కూలిన వంతెన

  • కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు
  • భూపాలపల్లి – గర్మిళ్ల పల్లి మధ్య ఉన్న దూరం తగ్గించే వంతెన
  • 2016లోనే మొదలైన వంతెన నిర్మాణం పనులు
  • కాంట్రాక్టర్ల అలసత్తం, నిధుల కొరతతో నత్తనడకన సాగిన నిర్మాణం
  • రాత్రి సమయం కావడంతో తప్పిన పెను ప్రమాదం
  • పగటిపూట అయితే ప్రాణ నష్టం జరిగేది
  • బ్రిడ్జి నిర్మాణ లోపాలపై పలు సందేహాలు

Maneru brook Bridge: మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు ఒక్కసారిగా కూలిపోయాయి. ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలలకు వంతెన గడ్డర్లు కుప్పకూలిపోయాయి. సోమవారం అర్థరాత్రి జరిగిన ఘటనతో ఒక్కసారిగా స్థానికులు విస్తుపోయారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు పరిధిలో జరిగింది. 2016 నుంచి ఈ వంతెన నిర్మాణం జరుగుతూనే ఉంది. ఈ వంతెన పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిళ్ల పల్లి మధ్య ఉంది. ఈ రెండు జిల్లాల మధ్య దూరం తగ్గించేందుకు వంతెన నిర్మాణం జరుగుతోంది. అయితే దాదాపు ఎనిమిదేళ్ల నుంచి వంతెన నిర్మాణ పనులు ప్రారంభమైనా కొంత వరకు మాత్రమే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మధ్యలో కాంట్రాక్టర్లు మారడం, నిధుల కొరత వంటి కారణాలతో వంతెన నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది.

బ్రిడ్జి నిర్మాణం పెండింగ్లో ఉండటంతో స్థానికులు అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న ఈ వంతెన అర్ధరాత్రి సమయంలో కుప్పకూలింది. రాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పగటివేళ రాకపోకల సమయంలో కూలి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈదురుగాలులకే వంతెన కూలడంతో వంతెన నిర్మాణం నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?