Krmb
Uncategorized

Krmb : సరిపడా నీరు లేదు.. జాగ్రత్తగా వాడుకోవాలి: కేఆర్ ఎంబీ

Krmb : కృష్ణా నది జలాల నీటి పంపకాలపై గురువారం కేఆర్ ఎంబీతో రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఇందులో కేఆర్ ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు తాగునీటి వినియోగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎందుకంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) లలో తెలుగు రాష్ట్రాలు కోరినంత నీరు లేదని స్పష్టం చేశారు. కనీస వినియోగ మట్టానికి పైన 60టీఎంసీల నీరు మాత్రమే ఉందని అతుల్ జైన్ తెలిపారు.

తెలంగాణ 63 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 55 టీఎంసీలు కావాలని కోరాయి. కానీ అంత నీరు మాత్రం రెండు ప్రాజెక్టుల్లో లేవు. కాబట్టి వీటిని కాపాడుకుంటూ మే నెల వరకు వినియోగించుకోవాలన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వర్లు సమావేశానికి హాజరు అయ్యారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ సమావేశం ఎట్టకేలకు గురువారం నిర్వహించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!