Hyderabad Cheetah
Uncategorized

Hyderabad : భాగ్యనగరంలో చిరుత.. బీ అలెర్ట్

  • హైదరాబాద్ వాసులను బయపెడుతున్న చిరుత
  • రెండు రోజుల క్రితం ఎయిర్ పోర్టులో కనిపించి మాయం
  • సీసీ కెమెరాలకు చిక్కిన చిరుత
  • అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు
  • గాలింపు చర్యలు ముమ్మరం
  • సమీప ప్రాంతాలలో చిరుత ఆనవాళ్లు
  • కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్న అధికారులు

Hyderabad cheetah:
రెండు రోజుల క్రితం శంషాబాద్ లో ఓ చిరుత రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై తిరుగుతుండటాన్ని గమనించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు తొమ్మిది ట్రాప్ కెమెరాలు ఉంచారు. డ్రోన్ కెమెరాలతో వెదుకుతున్నారు. చిరుత ఈ సమీపంలోనే ఉండవచ్చన్న అంచనాలో అధికారులున్నారు. చిరుత బోను వద్దకు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయింది. బోనులో ఒక మేకను కూడా ఉంచారు. కాగా చిరుత) కదలికలు సీసీ కెమెరాలకు చిక్కడంతో ఆందోళన కలిగిస్తోంది. డ్రోన్ల ద్వారా చిరుత జాడ కోసం వెదుకుతున్నారు. కానీ చిరుత మాత్రం కనిపించడం లేదు. ఎయిర్ పోర్టు ఫెన్సింగ్ దూకడంతో ఎయిర్‌పోర్టులోని అలారం మోగడంతో అప్రమత్తమయిన అధికారులు చిరుత రావడాన్ని గమనించారు. ట్రాప్ కెమెరాలో చిరుతను గుర్తించిన అధికారులు దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
చిరుత రింగ్ రోడ్డులోపలికి ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏప్రిల్ 27న అర్ధరాత్రి చిరుతపులి కనిపించింది. విమానాశ్రయంలోని ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ సెక్షన్‌లోని కంచెపై నుంచి దూకేందుకు చిరుత ప్రయత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత ఆనవాళ్లు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.

దాహార్తి కోసమేనా..

వేసవి కాలంలో శంషాబాద్‌, యాచారం, మొయినాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో చిరుతపులులు సాధారణంగానే కనిపిస్తుంటాయి. చిరుత పులులు ఆహారం, నీటి కోసం మనుషుల నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉంటాయి. ఇవి ఎక్కువగా వీధి కుక్కలను వెంటాడుతాయి. మనుషులపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. గతంలో కూడా ఒక చిరుత పులి ఎయిర్ పోర్టు గోడ దూకి వెళ్లిన ఘటన అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఫారెస్ట్‌ అధికారుల సహాయంతో దానిని పట్టుకోడానికి ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసి గాలించారు. ఎయిర్ పోర్ట్ గోడ దూకి పెద్ద గోల్కొండ, బహదూర్ గూడ వైపు చిరుత వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. అప్పటి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది. తాజాగా ఇప్పుడు మరోమారు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత సంచారం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!