Talasani Brother Shankar Yadav died: ‘తలసాని’ ఇంట విషాదం:
Talasani brother died
Political News, Uncategorized

Hyderabad: ‘తలసాని’ ఇంట విషాదం

Ex Minister Talasani Srinivas Yadav Brother Shankar Yadav died kcr tribute:

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు తలసాని శంకర్ యాదవ్ సోమవారం కన్నుమూశారు.గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మారేడ్‌పల్లిలోని నివాసానికి శంకర్‌ యాదవ్‌ మృతదేహాన్ని తరలించారు. మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న శంకర్ యాదవ్.. గతంలో బోయిన్‌పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా పని చేశారు.

సంతాపం తెలిపిన కేసీఆర్

శంకర్ యావద్ అకాల మృతితో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధు, మిత్రులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. శంకర్ యాదవ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సైతం సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్టకాలంలో భగవంతుడు వారికి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. ఆయన భౌతికకాయానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కాలేరు వెంకటేశ్‌, బీఆఎస్‌ నేతలు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ నివాళులర్పించారు. మాజీ మంత్రి తలసానిని ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?