Dost Notification: డిగ్రీలో ప్రవేశాలకు గాను త్వరలోనే దోస్త్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. మాసబ్ ట్యాంకులోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు.
GHMC Staff Recruitment: జీహెచ్ఎంసీ సిబ్బంది భర్తీ.. కొత్త నియామకాలతో సమస్యలు తీరేనా?
కాగా ఇంటర్ ఫలితాలు రిలీజ్ అవ్వడంతో త్వరలోనే దోస్త్ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీలో ప్రవేశాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అండర్‌గ్రాడ్యుయేట్ పాఠ్యాంశాలు ప్రస్తుత ట్రెండ్స్ కు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దబోతున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీలో కృత్రిమ మేధస్సు(ఏఐ), డేటా సైన్స్ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు