CM Revanth Reddy( IMAGE credit: twitter)
తెలంగాణ

CM Revanth Reddy: మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు..

CM Revanth Reddy: హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖ‌ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాల‌యంలో  ఉన్నతాధికారుల‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

 Also Read: Gadwal district: గద్వాల జిల్లా కలెక్టర్‌కు అరుదైన గౌరవం.. సన్మానించిన ఉద్యోగులు

జాగ్రత్తలు తీసుకోవాలి

జీహెచ్ఎంసీ(ghmc)తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరద నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారుల‌కు సీఎం సూచించారు. రానున్న రెండు మూడు రోజులు వ‌ర్షాలు ఉంటాయ‌నే స‌మాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. విప‌త్తు స‌హాయ‌క బృందాలు అందుబాటులో ఉండాల‌ని, త‌క్షణ‌మే స్పందించాల‌ని సీఎం ఆదేశించారు.

 Also Read: Gadwal District: గురుకుల విద్యార్థుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!