Charmy Kaur: ఛార్మి కౌర్ నటిగా సినిమాలు పక్కన పెట్టిన తర్వాత కాస్త బొద్దుగా తయారైన సంగతి తెలిసిందే. పూరి జగన్నాద్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. సంయుక్త మీనన్, టబు, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ సోషల్ డ్రామా ఎంటర్‌టైనర్ జూన్ 2025 నుండి షూటింగ్ వేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. అయితే ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచీ అమ్మడు తెగ ప్రమోషన్స్ చేస్తుంది. సినిమాకు సంబంధించిన నటీ నటులను కలిసి వారితో దిగిన ఫోటోలను తెగ షేర్ చేస్తుంది.
Read also- Minister Seethakka: సమిష్టి కృషితో అభివృద్ధిలో జిల్లా నిలుపుదాం: మంత్రి సీతక్క
ఒకప్పుడ బోద్దుగా, ముద్దుగా ఉన్న చార్మి ఇప్పుడిలా సన్నబడటంపై అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇలా సడన్ గా సన్నబడితే ఆరోగ్యం పాడైపోతుందంటూ సలహాలు ఇస్తున్నారు. అయితే ‘లైగర్’ సినిమా ప్రమోషన్ లో బొద్దుగా కనిపించి ఇప్పుడు నాజూగ్గా అవ్వడం చూసిన నెటిజన్లు మళ్లీ నటించడానికి రెడీగ అవుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. చార్మీ మాత్రం ఎక్కడా తాను నటిస్తు్న్నా అంటూ తెలపలేదు. ఆమె వెయిట్ తగ్గడం అంతా డైట్ లో భాగం అంటూ కొందరు చెబుతున్నారు. ఛార్మి కౌర్ టాలీవుడ్ అగ్ర హీరోల సరసన హీరోయిన్‌గా నటించి స్టార్ నటిగా గుర్తింపు పొందింది. సంప్రదాయంగా కనిపిపించిన ఆమె జ్యోతిలక్ష్మి చిత్రంలో బోల్డ్ పాత్రలో నటించి షాకిచ్చింది. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తూ ఫ్యాన్స్ అలరించి. తర్వాత నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా సెటిలైపోయింది. ప్రస్తుతం పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో సహా నిర్మాతగా ఉంటూ సినిమాలను నిర్మిస్తోంది.
Read also- Kalpika controversy: మరోసారి వివాదం సృష్టించిన నటి కల్పిక..
తాజాగా చార్మీ, పూరీ జగన్నాద్‌లు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తు్న్న ‘ది రాజాసాబ్’ సెట్‌లో కనిపించారు. అంతే కాకుండా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘సార్ మేడమ్’ సినిమా హిట్ అయినందుకు కేక్ కట్ చేశారు. అందులో కూడా ఆమె చాలా నాజూగ్గా కనిపించారు. దీంతో నెటిజన్లు చార్మీ సన్నబడటం గురించి సీక్రెట్ ఉంటే చెప్పాలంటూ అడుగుతున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’. 2025 డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించి ఓ ఫోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీం.