Peddi Sudharshan reddy criticised
Uncategorized

Telangana: పట్టు కోల్పోతున్న సీఎం

  • సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
  • రేవంత్ రెడ్డి పనితీరుపట్ల సొంతపార్టీ ఎమ్మెల్యేలలో విశ్వాసం తగ్గింది.
  • ఆయన సీఎం కావడం మెజారిటీ శాసనసభ్యులకు ఇష్టం లేదు.
  • 64 మంది లో కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సిఎం కు మద్దతు
  • 38 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కి వ్యతిరేకం
  • అందుకు నిదర్శనమే వరంగల్ లో ఎదురైన సంఘటన.
  • పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుకు మాత్రమే సిఎం ప్రాధాన్యత ఇస్తున్నారు
  • మిగిలిన మంత్రులపై నమ్మకం లేదా…?

BRS ex MLA Peddi Sudharshan reddy criticised cm Reventh ministers
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపట్ల ఆయన సొంతపార్టీ ఎమ్మెల్యేలో విశ్వాసం తగ్గిందని అన్నారు. ఆయన్ను సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని., ఆయన సీఎం కావడం మెజారిటీ శాసన సభ్యులకు ఇష్టం లేదని, 64 మంది కాంగ్రెస్ నుండి గెలిస్తే అందులో కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సీఎం కు మద్దతు ఇస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. 38 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ని వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిదర్శనమే వరంగల్ లో ఎదురైన సంఘటన అని ఆయన అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుకు మాత్రమే సిఎం ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అంటూనే.. మిగిలిన మంత్రులపై నమ్మకం లేదా…? అంటూ ప్రశ్నించారు.

ఇద్దరు మాత్రమే

కేబినెట్ లో ఇద్దరు మంత్రులు మాత్రమే ఆయన నిర్ణయాలను స్వాగతిస్తున్నారని., ఆయనపై స్వంత పార్టీలో ధిక్కారం పెరిగి పోయిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తన వర్గాన్ని పెంచుకోవడం కోసం బిఆర్ఎస్ ఎంఎల్ఏ లను గుంజుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందిని., గంటకో హత్య జరుగుతుందంటూ.. రాష్ట్రంలో పాలన పట్టు తప్పిందంటూ ఆయన తెలిపారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!