- జూన్ 5తో ముగియనున్న ఎన్నికల కోడ్
- పాలనపై ప్రక్షాళన మొదలు పెట్టిన అధికార యంత్రాంగం
- ఎన్నో ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో పాతుకుపోయిన అధికారులు
- బదిలీల సమయం రాగానే పైరవీలు మొదలు
- తమకు ఇష్టమైన చోటికే బదిలీ అయ్యేలా రికమెండేషన్లు
- రెవెన్యూ శాఖలో తిష్ట వేసిన లంచావతారులు
- ఇప్పటికే నివేదికలు తయారు చేసిన అధికారులు
- ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి
T.Government decide to trannsfer the officials:
జూన్ 5తో ఎన్నికల కోడ్ ముగియనుంది. తెలంగాణలో పలు మార్పులకు శ్రీకారం చుట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం శాఖల వారీగా సమీక్ష సమావేశాలు జరిపిన రేవంత్ సర్కార్ మరిన్ని కీలక శాఖల ప్రక్షాళన మొదలుపెట్టనుంది. ఆ ప్రక్రియలో భాగంగానే ఎప్పటినుంచో కీలక శాఖలలో పాతుకుపోయిన కొందరు సీనియర్లను సంబంధిత శాఖలనుంచి బదిలీ చేయలని చూస్తోంది. ఏ క్షణమైనా అధికారుల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఇప్పటికే అధికారులు బదిలీలకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. వాటిని సీఎం కు పంపించి అప్రూవల్ కాగానే ట్రాన్స్ ఫర్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు.
పైరవీలు షురూ
అన్ని కీలక శాఖలలో కిందిస్థాయి నుంచి పై స్థాయి ఉన్నతాధికారి దాకా బదిలీ తప్పనిసరిగా మారనుంది. అయితే కొందరు తాము కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడానికి ఇప్పటినుంచే పైరవీలు మొదలుపెట్టినట్లు సమాచారం. సొంత జిల్లాలలో పనిచేసేందుకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సంవత్సరాల
తరబడి వైద్య ఆరోగ్య శాఖలలో బదిలీలు లేకపోవడంతో ఎక్కువగా ఈ శాఖలోనే బదిలీలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు వైద్యఆరోగ్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే యోచనలో ఉంది రేవంత్ సర్కార్. మొదట ఈ డిపార్ట్ మెంట్ లోనే బదిలీల ప్రక్రియ మొదలు కానున్నట్లు సమాచారం. అలాగే కొన్నేళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా బదిలీలు లేక ఒకే చోట ఉండిపోయారు. గత ఆరు సంవత్సరాలుగా వైద్యశాఖ ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న వాళ్ల డిప్యూటేషన్లు రద్దు చేసి కొన్ని జిల్లటాలలో మాత్రం సక్రమంగా చేయలేదు. అయితే లేని ఎమర్జెన్సీ క్రియేట్ చేసి కొందరు డిప్యూటేషన్ నుండి మినహాయింపు పొందారని రద్దు చేసిన జిల్లాలలో మాత్రం సక్రమంగా చేయలేదనే విమర్శలు సొంత శాఖ నుంచే వస్తున్నాయి.
రెవెన్యూలో శాఖలో బదిలీలు
ఇక ఎక్కువగా అవినీతి ఆరోపణల వచ్చే శాఖ రెవెన్యూ. ఈ శాఖలో ఎక్కువగా లంచాలు తీసుకునే ఆస్కారం ఉండటంతో ప్రతి ఒక్కరి కన్నూ ఈ శాఖపైనే ఉంటుంది. ఏఆర్వో, ఆర్వో, డీటీ, తహసీల్దార్, ఆర్డీవో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తదితర కీలక అధికార్లపై బదిలీ వేటు తప్పదని అంటున్నారు. అయితే ఏ ప్రాంతంలో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయో, ఆర్థిక లావాదేవీలు సైతం ఎక్కువగా జరుగుతుంటాయో అక్కడ పోస్టింగ్ లను బదిలీ చేయించుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల రికమెండేషన్ తీసుకుని తమ పనులను చేయించుకుంటారనే టాక్ వినిపిస్తోంది. మరికొందరు తమని ఎక్కడ ఏ మారుమూల కనీస సదుపాయాలు లేని ప్రాంతాలకు బదిలీ చేస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నాట్లు తెలుస్తోంది.
ఏళ్ల తరబడి ఒకే చోట తిష్ట
కొన్ని కీలక శాఖలలో ఏళ్ల తరబడి తిష్ట వేసుకుని అక్కడే ఉంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు మూడు, ఐదేళ్ల లోపు బదిలీలు చేపట్టాలి. అధికారులపై ఎన్ని ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా సీట్లు వదలడం లేదు. మరి కొందరు పై ఆఫీసర్లను మచ్చిక చేసుకుని కోరుకున్న చోట కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి ఆఫీసర్లను ట్రాన్స్ఫర్లు చేయాలని సొంత శాఖ ఉద్యోగులే కోరుకుంటున్నారు. ఇక రెవెన్యూతోపాటు సాధారణ పరిపాలన, ఎడ్యుకేషన్, హెల్త్, మున్సిపల్, పంచాయతీ, అగ్రికల్చర్, పశు, సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్లతో పాటు ఇతర అన్ని విభాగాల్లో పని చేస్తున్న అధికారులకు బదిలీలు ఉండనున్నాయి.