Year Ender 2025: 2025కు గుడ్ బై చెప్పే టైమ్ వచ్చింది. 2026కు స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉన్నది. ఇంకొన్ని గంటల్లో ఆ అద్భుత ఘడియలు రాబోతున్నాయి. అయితే, 2025లో భారత్‌లో జరిగిన ముఖ్యమైన అంశాలను తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ముఖ్యమైన విషయాలను ఓసారి గుర్తు చేసుకుందాం.
2025 భారత్ రౌండప్
జనవరి 5
బీజాపూర్ నక్సల్స్ దాడి. 9 మంది సామాన్య పౌరులు, 8 మంది పోలీసుల మృతి
జనవరి 6
అసోంలోని కోల్ మైన్‌లోకి వరదలు. 9 మంది మృతి
జనవరి 8
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కేంద్రాల దగ్గర తొక్కిసలాట. ఆరుగురి మృతి
జనవరి 13
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా ప్రారంభం. 144 సంవత్సరాల తర్వాత జరిగిన మహా కుంభ్ వేడుక
జనవరి 18
కోల్‌కతాలో మెడికల్ విద్యార్థిని హత్యాచారం. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఘటన
జనవరి 26
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఢిల్లీలో ఆకట్టుకున్న మిలటరీ పరేడ్
జనవరి 28
మహా కుంభమేళాలో తొక్కిసలాట. 30 మంది మృతి
ఫిబ్రవరి 9
బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్. 31 మంది మావోయిస్టులు, ఇద్దరు సైనికుల మృతి
పిబ్రవరి 9
మణిపూర్ హింస నేపథ్యంలో అప్పటి సీఎం బరెన్ సింగ్ రాజీనామా
ఫిబ్రవరి 10 నుంచి 14
బెంగళూరులో ఏరో ఇండియా 2025
ఫిబ్రవరి 15
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట. 18 మంది మృతి
ఫిబ్రవరి 19
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా నియామకం
ఫిబ్రవరి 20 నుంచి 27
ఢిల్లీలో ఖేలో ఇండియా పారా గేమ్స్
మార్చి 9
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా. మొత్తంగా మూడో ట్రోఫీ
మర్చి 20
ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో ఎన్‌కౌంటర్. 30 మది మావోయిస్టులు, ఒక సైనికుడి మృతి
మార్చి 29
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్. 16 మంది నక్సల్స్ మృతి
ఏప్రిల్ 1
గుజరాత్‌లోని అక్రమ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు. 21 మంది మృతి
ఏప్రిల్ 5
అమలులోకి వక్ఫ్ సవరణ చట్టం
ఏప్రిల్ 22
పహల్గామ్ ఉగ్ర దాడి. 26 మంది మృతి
ఏప్రిల్ 29
కోల్‌కతాలో జరిగిన హోటల్ ప్రమాదంలో 14 మంది మృతి
ఏప్రిల్ 30
జణగణనలో కులగణన చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటన
మే 7
బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్. 15 మంది నక్సల్స్ హతం
మే 7
ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారం. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు. 6 ప్రదేశాల్లో 24 దాడులు
మే 10
భారత్, పాక్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం
మే 12
టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్
మే 14
అమృత్‌సర్‌లో కలుషిత మద్యం తాగి 14 మంది మృతి
మే 21
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్. 27 మంది నక్సల్స్ మృతి
జూన్ 4
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం నేపథ్యంలో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట. 11 మంది మృతి
జూన్ 22
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం. 241 మంది మృతి
జూన్ 15 నుంచి జూలై 15
రాజ్యసభ ఎన్నికలు
జూన్ 15
కేదార్‌నాథ్ హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురి మృతి
జూన్ 25
శుభాంశు శుక్లా రోదశీ యాత్ర. ఆక్సియం మిషన్ 4 ద్వారా అంతర్జాతీయ స్పేస్ స్పేషన్ టూర్
జూలై 28
ఆపరేషన్ మహాదేవ్. పహల్గామ్ ఉగ్ర దాడి మాస్టర్ మైండ్ సహా ముగ్గురు ఉగ్రవాదుల హతం
జూలై 31
భారత్ ఎగుమతులపై 25 శాతం అదనంగా టారిఫ్ విధించిన అమెరికా
ఆగస్ట్ 6
భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్ విధించిన అమెరికా
ఆగస్ట్ 11
ఢిల్లీలో వీధి కుక్కలు తరలిచాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఆగస్ట్ 14
జమ్మూకాశ్మీర్ వరదల వల్ల 65 మంది మృతి
ఆగస్ట్ 26
జమ్మూకాశ్మీర్ వరదల కారణంగా 30 మంది మృతి
ఆగస్ట్ 28
మహారాష్ట్రలో భవనం కూలి 17 మంది మృతి
సెప్టెంబర్ 2
పంజాబ్ వరదల నేపథ్యంలో 30 మంది మృతి
సెప్టెంబర్ 3
దేశంలో జీఎస్టీ సంస్కరణలు అమలులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం
సెప్టెంబర్ 9
భరత ఉపరాష్ట్రపతి ఎన్నిక. సీపీ రాధాకృష్ణన్ గెలుపు
సెప్టెంబర్ 9 నుంచి 28
ఆసియా కప్ నిర్వహణ. ఫైనల్‌లో భారత్ గెలుపు
సెప్టెంబర్ 11
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్ మృతి
సెప్టెంబర్ 16
ఉత్తరాఖండ్ వరదల కారణంగా 15 మంది మృతి
సెప్టెంబర్ 16
ఆయుధలు వదిలిపెడతామని మావోయిస్టుల ప్రకటన. శాంతి చర్చలకు పిలుపు
సెప్టెంబర్ 22
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ కమాండర్స్ కడారి సత్యనారాయణ రెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి హతం
సెప్టెంబర్ 27
తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కొసలాట. 40 మంది మృతి
అక్టోబర్ 5
పశ్చిమ బెంగాల్‌లో భూకంప తీవ్రతకు 24 మంది మృతి
అక్టోబర్ 6
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న బీఆర్ గవాయ్‌పై షూ దాడి
అక్టోబర్ 14
రాజస్థాన్‌లో బస్సు ప్రమాదం. 26 మంది మృతి
అక్టోబర్ 24
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుజిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 25 మంది మృతి
నవంబర్ 1
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట. 9 మంది మృతి
నవంబర్ 1
అత్యంత పేదరికం లేని మొదటి రాష్ట్రంగా కేరళ ప్రకటన
నవంబర్ 2
జోథ్‌పూర్‌లో టెంపో, ట్రక్ ఢీ. 15 మంది మృతి
నవంబర్ 2
మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ గెలుపు
నవంబర్ 3
జైపూర్‌లో 17 వాహనాలను ఢీకొట్టిన ట్రక్. 19 మంది మృతి
నవంబర్ 3
తెలంగాణలోని చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం. 24 మంది మృతి
నవంబర్ 4
ఛత్తీస్‌గఢ్‌లో గూడ్స్, ప్యాసింజర్ ట్రైన్ ఢీకొని 11 మంది మృతి
నవంబర్ 10
ఢిల్లీలో ఉగ్ర దాడి. కారు పేలుడులో 15 మంది మృతి
నవంబర్ 14
బిహార్ ఎన్నికల ఫలితాలు. ఎన్డీఏ గెలుపు
నవంబర్ 15
జమ్మూకాశ్మీర్‌లోని పోలీస్ స్టేషన్‌లో పేలుడు. 9 మంది మృతి
నవంబర్ 18
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్ట్ కమాండర్ హిడ్మా, అతని భార్య మృతి
నవంబర్ 30
తమిళనాడులోని శివగంగ బస్సు ప్రమాదంలో 10 మంది మృతి
డిసెంబర్ 5
ఇండిగో సంక్షోభం. డిసెంబర్ 9 వరకు కార్యకలాపాల నిలిపివేత
డిసెంబర్ 6
గోవాలోని ఆర్పోరా నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం. 25 మంది మృతి
డిసెంబర్ 8
నటిపై బలవంతం కేసులో నిర్దోసిగా బయటపడ్డ నటుడు దిలీప్
డిసెంబర్ 13
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా, హైదరాబాద్ పర్యటన. తెలంగాణలో గ్రాండ్‌గా కార్యక్రమం. బెంగాల్‌లో ఫ్యాన్స్ రచ్చ
డిసెంబర్ 24
ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగం
డిసెంబర్ 25
కర్ణాటక చిత్రదుర్గలో స్లీపర్ బస్సు ప్రమాదంలో 11 మంది మృతి.
Also Read: TG CETs 2026: తెలంగాణ సెట్స్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్షల తేదీలివే..!
2025 తెలంగాణ రౌండప్
జనవరి 26
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఫిబ్రవరి 7
హైదరాబాద్ హైటెక్స్‌లో సమగ్ర వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమం
ఫిబ్రవరి 22
కుప్పకూలిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్. 8 మంది మృతి
మార్చి 19
అసెంబ్లీలో రూ.3,04,965 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మే 6 నుంచి 31
మిస్ వరల్డ్ 2025 వేడుకలు. ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన అందగత్తెలు హైదరాబాద్ వచ్చారు.
మే 18
హైదరాబాద్ పాతబస్తీ గుల్జర్ హౌస్ అగ్నిప్రమాదం. 17 మంది మృతి
మే 30
రాష్ట్రంలో తొలిసారి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం
జూన్ 2
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.
జూన్ 30
సిగాచీ పరిశ్రమలో భారీ విస్ఫోటనం. 54 మంది మృతి
నవంబర్ 19 నుంచి 25
వరల్డ్ హెరిటేజ్ వీక్
నవంబర్ 20 నుంచి 27
తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ కార్యక్రమం
డిసెంబర్ 1 నుంచి 6
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిన సందర్భంగా వేడుకలు
డిసెంబర్ 8 నుంచి 9
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల
డిసెంబర్ 13
ఫుట్‌బాల్ దిగ్గజం లియెనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన. సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్ బాల్ మ్యాచ్.
Also Read: Delhi Fog: న్యూఇయర్ ప్రయాణికులకు షాక్.. ఢిల్లీ లో పొగమంచు కారణంగా 148 విమానాలు రద్దు

