TG CETs 2026: తెలంగాణ సెట్స్ షెడ్యూల్ రిలీజ్ తేదీలివే..!
TG CETs 2026 (imagecredit:twitter)
Telangana News

TG CETs 2026: తెలంగాణ సెట్స్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్షల తేదీలివే..!

TG CETs 2026: రాష్ట్రంలోని వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు(టీజీ సెట్స్-2026) షెడ్యూల్‌ రిలీజైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్, సెక్రటరీ బాలకిష్టారెడ్డి(Balakrishn Reddy), శ్రీరాం వెంకటేశ్ మంగళవారం ఈ షెడ్యూల్ ను ప్రకటించారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించే ఉమ్మడి ప్రవేశ్ పరీక్​షలు వచ్చే ఏడాది మే 4 నుంచి ప్రారంభమై.. జూన్ 3 వరకు కొనసాగనున్నాయి. అన్ని పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఈఏపీసెట్ ప్రవేశ పరీక్​షను జేఎన్టీయూ హెచ్ అధికారులు నిర్వహించనున్నారు.

Also Read: Crime Report 2025: విశాఖలో పెరిగిన హత్యలు.. తగ్గిన అత్యాచారాలు.. క్రైమ్ రిపోర్టులో సంచలన లెక్కలు

ఈ పరీక్షలు..

ఈ పరీక్​షలు అగ్రికల్చర్(Agriculture), ఫార్మసీ(Pharmacy) విభాగానికి మే 4, 5 తేదీల్లో, ఇంజినీరింగ్ విభాగానికి మే 9, 10, 11 తేదీల్లో జరగనున్నాయి. ఎడ్ సెట్ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. మే 12న ఈ ఎగ్జామ్ జరగనుంది. ఐసెట్ ను మహాత్మగాంధీ వర్సిటీ నిర్వహించనుంది. మే 13, 14 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇకపోతే ఈసెట్ పరీక్షను ఉస్మానియా వర్సిటీ(OU) నిర్వహించనుంది. మే 15న ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. లాసెట్ ను కూడా ఓయూనే నిర్వహించనుంది. మే 18న ఈ పరీక్ష జరగనుంది. పీజీఈసెట్ ను జేఎన్ టీయూహెచ్ చేపట్టనుంది. మే 28 నుంచి 31 వరకు కొనసాగనున్నయి. ఇకపోతే పీఈసెట్ ను శాతవాహన యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ పరీక్షలు మే 31 నుంచి జూన్ 3 వరకు కొనసాగనున్నాయి.

Also Read: New Year 2026 Wishes : మీ ప్రియమైన వారికీ న్యూ ఇయర్ విషెస్ ఇలా చెప్పేయండి!

Just In

01

Maruthi Surprise: అడ్రస్ ఇచ్చినందుకు మారుతీ ఇంటికి ప్రభాస్ ఫ్యాన్స్ ఏం పంపారో తెలుసా?.. ఇది వేరే లెవెల్..

DCP Aravindh Babu: బ్యాంక్ ఖాతాలు సమకూరిస్తే కటకటాలే.. సైబర్​ క్రైం డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్!

Ghantasala Biopic: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీ.. ఎప్పుడంటే?

Basti Dawakhana: బస్తీ దవాఖానల డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ సమస్యలకు చెక్.. కొత్త సిస్టమ్ అమలు..!

Uttarakhand : ఉత్తరాఖండ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో ఘోర ప్రమాదం.. 60 మందికి గాయాలు