World Environment day( image credIt: Swetcha reporter)
తెలంగాణ

World Environment day: ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్.. వాడకాన్ని తగ్గించాలి!

World Environment day: ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కోరారు. ప్లాస్టిక్ రీ సైక్లింగ్ కు సహకరించాలన్నారు. హైదరాబాద్( Hyderabad)  లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో గురువారం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకొని భవిష్యత్ తరాలను కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మన అందరిపై ఉందన్నారు. యావత్ ప్రపంచానికే సవాల్ గా మారిన ప్లాస్టిక్ నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు సంయుక్త కృషి అవసరం అన్నారు. ఈ సంవత్సరం ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అంతం చేయడం అనే థీమ్ తో ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.

19.04 కోట్ల మొక్కలను నాటారు

ప్లాస్టిక్ కాలుష్యం నిర్మూలన వైపు మనమంతా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వనమహోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నదన్నారు. గతేడాది 20.2 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటే, 19.04 కోట్ల మొక్కలను నాటామన్నారు. పర్యావరణ మెరుగు పరిచేందుకు తమ ప్రభుత్వం, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎకో టూరిజం, పార్కుల్లో కీలక మార్పులు చేపడుతున్నామని వివరించారు.

  Also Read: Konda Surekha: మంత్రి కొండా సురేఖకు తీవ్ర అస్వస్థత.. సడన్‌గా ఎందుకిలా?

ప్లాస్టిక్ నిర్మూలించేందుకు పని చేయాలి

సహజ వనరులు మన సమిష్టి వారసత్వమని… వీటిని జాగ్రత్తగా, న్యాయంగా వినియోగించి భావితరాలకు అందించడం మన బాధ్యత అని మంత్రి సురేఖ (Konda Surekha) నొక్కి చెప్పారు. పాలసీ రూపకర్తలుగా, నిర్వాహకులుగా, పౌరులుగా మనం రాజ్యాంగబద్ధంగా ప్లాస్టిక్ నిర్మూలించేందుకు పని చేయాలని అన్నారు. సింగిల్-యూస్ ప్లాస్టిక్‌లను తొలగించి, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలన్నారు. బాధ్యతాయుతమైన రీసైక్లింగ్, పునర్వినియోగం కోసం మౌలిక సదుపాయాలను నిర్మించాలని అన్నారు.

ప్రతి పౌరుడికి పర్యావరణ పరిరక్షణ బాధ్యతను గుర్తు చేయాలి

అందుకోసం తమ ప్రజా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదన్నారు. ముఖ్యంగా, ప్రతి పౌరుడికి పర్యావరణ పరిరక్షణ బాధ్యతను గుర్తు చేయాల్సిన అనివార్యత ఉందన్నారు. తద్వారా భావి తరాల కోసం మనం పర్యావరణాన్నీ కాపాడగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి గూగులోత్, పీసీబీ బోర్డు మెంబర్లు సత్యనారాయణ రెడ్డి, విజయ లక్ష్మి, జయదేవ్, పాల్గొన్నారు.

 Also Read: Sravan on Bandi Sanjay: మిస్ ఇంగ్లాండ్ కు.. అవమానం జరిగితే బండి స్పందించరా?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు