HMDA: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (HMDA) పరిధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఎట్టకేలకు కసరత్తు మొదలైంది. హెచ్ఎండీఏ ఇటీవలే చేపట్టిన మూడు రకాల ప్రక్రియలతో సేకరించిన ఇన్ పుట్ తోనే మాస్టర్ ప్లాన్(Master Plan) సిద్దం చేయనుంది. ఇదివరకున్న మాస్టర్ ప్లాన్ ను గుజరాత్ కు చెందిన సెప్ట్ యూనివర్శిటీ(Seft Univercity) రూపకల్పన చేయగా, ఇపుడు మరో మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం కన్సల్టెన్సీని ఆహ్వానించేందుకు హెచ్ఎండీ(HMDA)ఏ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా హెచ్ఎండీఏ ఇప్పటి వరకు నిర్వహించిన గ్రీన్, బ్లూ, కాంప్రహెన్సీవ్ మొబిలిటీ ప్లాన్ ల కింద సేకరించిన ఎన్విరాన్ మెంట్, వాటర్ బాడీలు, ట్రాఫిక్(Traffic), రోడ్లు వంటి అంశాల ప్రాతిపదికన సేకరించిన సమాచారంతోనే ఈ మాస్టర్ ప్లాన్ ను సిద్దం చేయనుంది.
25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని
అయితే గతంలో హెచ్ఎండీఏ పరిధి 7 వేల కిలోమీటర్ల పరిధికి రాజస్థాన్(Rajyasthan) కు చెందిన ఓ విశ్వవిద్యాలయం మాస్టర్ ప్లాన్ ను రూపొందించగా, ఇపుడు రానున్న మరో 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్-2050 రూపొందించేందుకు హెచ్ఎండీఏ కన్సల్టెన్సీని ఆహ్వానించింది. గతంలో ఎనిమిది జిల్లాల్లో ఉన్న హెచ్ఎండీఏను రీజినల్ రింగ్ రోడ్డు(RRR) 11జిల్లాల పరిధికి విస్తరించింది. ఈ ప్రాంతాల్లో ఏరకమైన అభివ్రుద్ధి జరగాలి? ఏలాంటి జోనింగ్ విధానం ఉండాలి? అనే విషయాలను 2050 మాస్టర్ ప్లాన్ లో పొందుపర్చనున్నారు.
వీటిలో ప్రజా రవాణకు సంబంధించిన కాంప్రహెన్సివ్ మొబులిటీ ప్లాన్(సీఎంపీ), ఆర్థిక పరమైన అభివ్రుద్ధికి సంబంధించిన ఎకనామిక్ డవలప్ మెంట్ ప్లాన్(ఈడీపీ), నీటి వనరులు, పార్కులు, గ్రీనరీ డవలప్ మెంట్ కు సంబంధించిన బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ ఆధారంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం(Govt) నిర్ణయించింది. ఈ మూడు ప్రక్రియలతో వచ్చిన ఇన్ పుట్స్ తోనే హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్(HMDA Master Plan) 2050 రూపకల్పన చేయనున్నట్లు తెలిసింది.
Also Read: Marriage: ఏంటిది భయ్యా.. మగాళ్లను బతకనివ్వరా?
లీ అసోసియేట్స్ కు మొబులిటీ ప్లాన్
మాస్టర్ ప్లాన్-2050లో భవిష్యత్ ను ద్రుష్టి పెట్టుకుని ప్రజా రవాణ, ప్రయివేటు రవాణ మార్గాల అభివ్రుద్ది కోసం నేషనల్ అర్బన్ ట్రాన్స్ పోర్ట్ పాలసీ(ఎన్యూడీపీ)2006/2014కు లోబడి ఆచరణాత్మకమైన దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించే బాధ్యతను లీ అసోసియేట్స్ కు అప్పగించారు. హెచ్ఎండీఏ(HMDA), జీహెచ్ఎంసీ(GHMC), హెచ్ఎంఆర్ఎల్(HMRL) విభాగాలు అమలు చేస్తున్న రవాణ కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం, ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, గ్రిడ్ రోడ్లు, రేడియల్ రోడ్ల నిర్మాణం, మెట్రోరైలు(Metro Rail) ప్రాజెక్టులను ఎక్కడికి పొడిగించాలి? ఎయిర్ పోర్ట్(Air Port) అనుసంధానం రోడ్ల నిర్మాణం వంటి అంశాలను ప్లాన్ లో ఉండనున్నాయి.
పీక్ హవర్ పర్ డైరెక్షన్ ట్రాఫిక్
త్రిపుల్ ఆర్ వరకు అభివ్రుద్ధిని ద్రుష్టిలో పెట్టుకుని స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందిస్తున్నారు. పీక్ హవర్ పర్ డైరెక్షన్ ట్రాఫిక్ (పీహెచ్పీడీటీ) ఆధారంగా రవాణ మార్గాలు 2030, 2040, 2050 ఆధారంగా ప్లాన్ చేయనున్నారు.దీనికి సంబంధించిన పనులు ఏడాది కాలంలో పూర్తి చేయాలని నిర్ణయించగా, ఇటీవలే గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించారు. కన్సల్టెన్సీ నియమించుకునే లోపు ఆచరణాత్మకమైన లాంగ్ ప్లాన్ లను లీ అసోసియేట్ హెచ్ఎండీఏ(HMDA)కు సమర్పించనున్నట్లు తెలిసింది.
క్రిసిల్ ప్రయివేటు లిమిటెడ్ చే ఎకనామిక్ డవలప్ మెంట్ ప్లాన్
ప్రపంచంలోని పది నగరాల జాబితాలో హైదరాబాద్(Hyderabad) ఉండేవిధంగా ఎకనామిక్ డవలప్ మెంట్ ఫ్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో భవిష్యత్ లో ఎకనామిక్ డవలప్ మెంట్ ఎలా ఉండాలనేదానిపైనే ఫోకస్ గా పనిచేయాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్డు(ORR) లోపల ఆర్థికాభివ్రుద్ది ఎలా ఉండాలి? ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు మధ్య ఎలా ఉండాలి? ఐటీ పార్కులు, పారిశ్రామిక కారిడార్లు, జాతీయ రహదారులకు అనుసంధానంగా ఏలాంటి పరిశ్రమలు ఉండాలి? అనే అంశాలపై ముసాయిదా ప్లాన్ ను రూపొందించే
Also Read: Sonia Gandhi: ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణపై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు
హెచ్ఎండీఏకు ప్రణాళికలను పంపినట్లు
బాధ్యతను క్రిసిల్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థకు అప్పగించగా, ఈ ప్రక్రియ కూడా తుది దశలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు ఎన్సీపీఈకి బ్లూ, గ్రీన్ ప్లాన్ బాధ్యతలను అప్పగించగా, ఇప్పటికే ఈ కన్సల్టెన్సీ హెచ్ఎండీఏకు ప్రణాళికలను పంపినట్లు సమాచారం. రవాణ ఆధారిత ప్రాజెక్టులు, ఆర్థికాభివ్రుద్ధితోపాటు బ్లూ, గ్రీన్ మౌలిక సదుపాయాల కల్పన కూడా ముఖ్యమే. వాతావరణంలో వచ్చే మార్పులకనుగుణంగా వీటిని అభివ్రుద్ది చేయాల్సిన బాధ్యత ఎన్సీపీఈకి ఉంటుంది. పట్టణీకరణ పెరుగుతున్న తరుణంలో గ్రీన్ స్పేస్ కు ప్రాధాన్యత ఏర్పడింది. చెరువులు, కుంటల పరిరక్షణ కూడా సవాల్ తో కూడుకున్నది. ఈ ప్రణాళికలో నీటి వనరులను మ్యాపింగ్ చేయనున్నారు. వాతావరణ మార్పుల ఆధారంగా సంభవించే వైఫరీత్యాలు, వరద ముప్పు నివారణ చర్యలు, లేక్ ఫ్రంట్, రివర్ ఫ్రంట్, కాలువల గుర్తించే కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది.
రీక్రియేషన్ జోన్లు
నీటివనరుల ఆధారంగా పార్కుల ఏర్పాటుతోపాటు జీవవైవిధ్యాన్ని పరిరక్షించేవిధంగా ప్రజలకు ఆహ్లాదానిచ్చే రీక్రియేషన్ జోన్లు వంటి వాటిని మాస్టర్ ప్లాన్ లో పొందుపర్చనున్నారు. ఈ బ్లూ, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చన్ ప్రణాళిక రూపొందించే బాధ్యతను అప్పగించగా, ఇప్పటికే ఈ సంస్థ హెచ్ఎండీఏకు ప్రణాళికలను సమపర్పించగా, ఇందులోని ప్రధానాంశాలను పరిగణలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరగనున్నట్లు సమాచారం.
ల్యాండ్ యూజ్ ప్లానింగ్
దీంతో పాటు హెచ్ఎండీఏకు సంబంధించిన అన్ని రకాల ఆస్తులను జియో బేస్ మ్యాప్ లో పొందుపర్చనున్నారు. కాంప్రహెన్సివ్ మొబులిటీ ప్లాన్(సీఎంపీ), ఆర్థిక పరమైన అభివ్రుద్ధికి సంబంధించిన ఎకనామిక్ డవలప్ మెంట్ ప్లాన్(ఈడీపీ), నీటి వనరులు, పార్కులు, గ్రీనరీ డవలప్ మెంట్ కు ప్రణాళికలను సైతం మ్యాప్ లో పొందుపర్చనున్నారు. బేస్ మ్యాప్ ఆధారంగానే ల్యాండ్ యూజ్ ప్లానింగ్ చేయనున్నట్టు సమాచారం. ఈ నెలాఖరు వరకు మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి కానున్నట్లు సమాచారం.
Also Read: TG HC On Local Body Election: స్థానిక సంస్థల ఎన్నికలపై.. హైకోర్టులో విచారణ!