MLC Kavitha
తెలంగాణ

MLC Kavitha: కవితమ్మ కోరిక నెరవేరేనా? ఆ పదవి దక్కేనా?

MLC Kavitha: బీఆర్ఎస్ రాష్ట్ర సమితిలో కీలక పదవీ కావాలని ఎమ్మెల్సీ కవిత ఆశిస్తున్నట్లు సమాచారం. పదవి లేకుండా పార్టీలో గుర్తింపు ఉండదని, పార్టీ బలోపేతం చేయాలనే భావనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే, పార్టీ రాష్ట్ర కమిటీలో కీలకమైన సెక్రటరీ జనరల్ గానీ, వైస్ పెసిడెంట్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ ఇలా ఏదో ఒకటి ఇవ్వాలని పార్టీ అధినేత కేసీఆర్ ను ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టింది. జాగృతిని యాక్టీవ్ చేస్తూ పార్టీలో సొంత కేడర్ పైనా దృష్టి సారించినట్లు ప్రచారం ఊపందుకుంది. బీసీ, మహిళా అంశాలతోనూ ముందుకు వెళ్తుంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపైనా కవిత దూకుడు పెంచింది. ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కవిత జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత రాజకీయ స్పీడ్ పెంచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఏ ఒక్క అంశాన్ని సైతం వదిలిపెట్టకుండా సోషల్ మీడియా వేదికగాను, లేకుంటే మీడియా ముఖంగా ఎత్తిచూపుతున్నారు. అయితే పార్టీలో మాత్రం తగిన గుర్తింపు లేదనే భావనకు వచ్చినట్లు సమాచారం. అరెస్టు అయినప్పుడు పార్టీలో ఏ పదవి లేకపోవడంతో ఆశించిన స్పందన రాలేదని గుర్తించినట్లు ప్రచారం జరిగింది.

అందుకే పార్టీలో కీలక పదవి ఉన్నప్పుడు మాత్రమే కేడర్ గానీ, నాయకులు గానీ స్పందిస్తారని లేకుంటే ఎన్ని రోజులు ఉన్న ఇలాగే ఉంటుందని పలువురితో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. కేసీఆర్ కుమార్తెగా, ఎమ్మెల్సీగా ఉంటే లాభం ఉండదని రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు కోరుకుంటున్నట్లు సమాచారం. అందుకే, పార్టీలో అధ్యక్ష హోదాలో కేసీఆర్ ఉన్నారు. ఆయన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనసాగుతున్నారు. అయితే తనకు సైతం ఆ స్థాయిలో పార్టీలో పార్టీ పదవి కోరుకుంటున్నట్లు సమాచారం. పార్టీకి రెండో వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ, ఉపాధ్యక్ష పదవిగానీ, కార్యదర్శిగా గానీ బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధినేత కేసీఆర్ పై కవిత ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

Also Read: Dangerous Snake: సముద్రంలో ఉండే వింత పాము.. బయటకొస్తే ప్రళయమే?

పార్టీ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన కే కేశవరావు కాంగ్రెస్ లో చేరారు. ఆయన పార్టీ మారాక ఆ స్థానంలో ఎవరిని నియమించలేదు. ఆపోస్టు అధ్యక్ష పదవి తర్వాత కీలకమైనది. సమూన్నతమైనది. అయితే ఆ పదవి అప్పగిస్తే బాగుంటుందని కవిత అనుచరులు సైతం అభిప్రాయపడుతున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలంటే… ఏదైనా కార్యక్రమం చేపట్టాలన్న పార్టీ పదవి కీలకం. పార్టీలో ఏ హోదా లేకుండా పార్టీ కార్యక్రమాలు చేపడితే కేడర్ నుంచి గానీ, నాయకుల నుంచి గానీ ఆశించిన స్పందన రాదని అందుకే పార్టీ పదవి కావాలని కవిత ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే, కేసీఆర్ పార్టీ పదవి అప్పగిస్తారా? లేదా? అనేది చూడాలి.

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ అని ప్రచారం జరుగుతుంది. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనసాగుతుండగా ఎమ్మెల్యేగా హరీష్ రావు, ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా సంతోష్ సైతం పనిచేశారు. తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు.. కానీ, పదవులు అనుభవించేది కేసీఆర్ కుటుంబ సభ్యులు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి.

ఈ తరుణంలో కవితకు పార్టీ రాష్ట్ర కమిటీలో చోటు కల్పిస్తారా? కల్పిస్తే ఏ పదవి ఇస్తారు? ఇవ్వకపోతే కవిత ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే కవిత రాజకీయంగా స్పీడ్ పెంచారు. జిల్లాల పర్యటనలు చేస్తూ బీఆర్ఎస్ కేడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు జాగృతిని యాక్టీవ్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై తనదైనశైలీలో విమర్శలు గుప్పిస్తున్నారు. తనకంటూ ఓ కేడర్ ను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారనే ప్రచారం జరుగుతుంది.

బీసీలను చైతన్యం చేసేందుకు శ్రీకారంచుట్టి.. 42శాతం రిజర్వేషన్లపై పోరాట కార్యచరణ చేపట్టింది. అందులో భాగంగానే ఫూలే ఫ్రంట్ ను ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. అసెంబ్లీలో ఫూల్ విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే మహిళల రిజర్వేషన్లపైనా రాష్ట్రంతో పాటు ఢిల్లీలోనూ గళం వినిపించారు. శాసన మండలి సమావేశాల్లోనూ ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై గళ మెత్తుతూనే అన్ని వర్గాల ప్రజల సమస్యలపైనా మాట్లాడారు.

రైతులు పడుతున్న ఇబ్బందులు, ముఖ్యంగా పసుపు రైతులకు గిట్టుధర కల్పించాలని, మహిళలకు తులంబంగారం, నెలకు 2500 అంశాన్ని మండలిలో ప్రస్తావించడంతో పాటు ప్లకార్డులతోనూ నిరసన తెలిపారు. తనకంటూ ఓ రాజకీయ గుర్తింపు కోసం స్పీడ్ పెంచారు కవిత. రాబోయే కాలంలో మరింత స్పీడ్ పెంచనున్నట్లు సమాచారం. నిరుద్యోగ, విద్యార్థి, మహిళ, రైతు, ఉద్యోగ, ఆశ, కాంట్రాక్టు కార్మికులు, ఇలా అన్ని వర్గాల పక్షాన పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు