Minister Pongileti Srinivasa Reddy: రప్పా.. రప్పా… డైలాగులు దేనికి సంకేతాలు బీఆర్ఎస్(BRS) నాయకులు హరీష్ రావు(Harish Rao), జగదీశ్వర్ రెడ్డి చెప్పాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ(Nalgoanda), ఖమ్మం(Khammam) జిల్లాల పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన లకు హాజరైన మంత్రి పొంగిలేటి(Ponguleti) రప్పా రప్పా అనే డైలాగులతో 3.0 లోడింగ్ అంటూ ప్రచారం చేసే బీఆర్ఎస్ నాయకుల పై మండిపడ్డారు. ఇలాంటి మాస్ డైలాగులతో రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నారో బీఆర్ఎస్(BRS) నాయకులు వెల్లడించాలని హెచ్చరించారు.
జగదీశ్వర్ రెడ్డి కి బ్రెయిన్ పనిచేయడం లేదా
తెలంగాణ అంటే ఎన్నో రకాల సంస్కృతి సాంప్రదాయాలకు పేరుగాంచిందని అలాంటి తెలంగాణ మాస్ సినిమా డైలాగులు తీసుకొని మాట్లాడడం సరికాదని చురకలు అంటించారు. పదేళ్లు ప్రభుత్వం ఉన్న సమయంలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి కి బ్రెయిన్ పనిచేయడం లేదా అని మండిపడ్డారు. ఎక్కడ మీటింగ్లు జరుగుతే అక్కడ ఫ్లెక్సీలు హోర్డింగ్లు పెట్టి సినిమా డైలాగులు రాయడమేంటని నిలదీశారు. మాస్ సినిమా డైలాగులతో హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు.
Also Read: MP Kishan Reddy: జాయినింగ్స్ పై కమలం ఫోకస్.. చేరికలు చేపట్టాలని పిలుపు
సభ్య సమాజం తలదించుకునేలా
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ(Indiramma) పాలనలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పరిపాలిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని మాస్ సినిమా డైలాగులతో నాశనం చేసేందుకు బీఆర్ఎస్(BRS) నాయకులు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ అంటిస్తున్న పోస్టర్లపై మంత్రి పొంగిలేటి తీవ్రంగా మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా సినిమా డైలాగులు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో వారే అర్థం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో పదేళ్లపాటు మంత్రి పదవులు అనుభవించి విచక్షణారహితంగా సినిమా డైలాగులు చెప్పడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు
Also Read: Telangana: ఒక్కొక్కరికి నెలకు రూ.2,016.. సర్కారు గుడ్ న్యూస్