Spa Center: స్పా ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహిళను వెస్ట్ జోన్టాస్క్ఫోర్స్ పోలీసులు సంజీవరెడ్డినగర్‌లో అరెస్ట్ చేశారు. అయిదుగురు కస్టమర్లతోపాటు స్పాలో పని చేస్తున్న ఓ యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బాలానగర్ ప్రశాంతినగర్ నివాసి అయిన ఎన్.సుధ (30) అమీర్ పేట గురుద్వారా ప్రాంతంలోని అల్రిచ్పూర్ణాదేవి అపార్ట్మెంట్లో ఎన్ఎస్బ్యూటీ సెలూన్ అండ్ స్పా పేర వ్యాపారం చేస్తోంది.
Also Read: Central on Maoists: మావోయిస్టుల పతనం పూర్తయినట్టేనా.. చివరి అధ్యాయం మాత్రమే మిగిలిందా!
ఇద్దరు ఏజెంట్లు నియమించుకొని
లింగంపల్లి శివనందిని అలియాస్ అంజలి, మద్దినేని సందీప్‌లను ఏజెంట్లుగా నియమించుకుంది. వారి ద్వారా విటులను స్పా సెంటర్‌కు పిలిపించుకుంటూ మహిళలతో ఓంటరిగా సమయం గడిపించి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వారిద్దరికి నెలకు 25వేల రూపాయలు జీతంగా ఇస్తోంది. ఇక స్పాకు వచ్చే ఒక్కో విటుని నుంచి 1500 నుంచి 2వేల రూపాయలు వసూలు చేస్తోంది. ఈ మేరకు సమాచారాన్ని సేకరించిన టాస్క్ ఫోర్స్, సంజీవరెడ్డినగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి సుధను అరెస్ట్ చేశారు.
ఆమెతోపాటు విటులు సాగిరాజు దినేశ్‌వర్మ(21), గూడాల గౌతం (28), నేనావత్ రవికుమార్(32), చవన్ సురేందర్(36), పిన్ని ప్రవీణ్ కుమార్(29)లతోపాటు ఓ మహిళా వర్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఎనిమిదిన్నర వేల రూపాయల నగదును, తొమ్మిది మొబైల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Chenab Rail Bridge: దేశ ప్రజలకు గుర్తుండిపోయే రోజు.. వరల్డ్‌లోనే ఎత్తైన వంతెన ప్రారంభం