Triple Murder Case: భార్య, పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి తగిన శాస్తి
Triple-murder-Case (Image source Twitter)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Triple Murder Case: భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి తగిన శాస్తి.. వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు

Triple Murder Case: కంటికి రెప్పలా చూసుకుంటానంటూ మాట ఇచ్చి పెళ్లి చేసుకున్న భార్యను, వారికి పుట్టిన ఒక బిడ్డను, భార్య తొలి భర్తకు పుట్టిన మరో బిడ్డను అత్యంత కర్కశంగా హత్య చేసిన (Triple Murder Case) ఓ కఠినాత్ముడికి తగిన శాస్తి జరిగింది. మరణశిక్ష విధిస్తూ వికారాబాద్ జిల్లా కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. గురు ప్రవీణ్ అనే వ్యక్తి దోషిగా తేలడంతో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డి ఈ తీర్పు ఇచ్చారు. రూ.10 వేల జరిమానా కూడా విధించారు.

Read Also- NC24 Update: ‘ఎన్‌సి24’ బీటీఎస్ మేకింగ్ వీడియో చూశారా? టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే?

దోషి గురుప్రవీణ్ 2019 ఆగస్టు నెలలో ఈ దారుణ హత్యలకు పాల్పడ్డాడు. హత్యకు గురైన మహిళ పేరు చాందిని. ఆమె ఫోన్‌లో ఎవరితోనో నిత్యం మాట్లాడుతోందనే అనుమానాన్ని పెంచుకొని ప్రవీణ్ ఈ ఆటవీక చర్యకు పాల్పడ్డాడు. నిజానికి చాందినీకి ప్రవీణ్ కంటే ముందే మరో వ్యక్తితో వివాహమైంది. మొదటి భర్తకు జన్మించిన బిడ్డను కూడా చూసుకుంటానంటూ ప్రవీణ్ మాట ఇవ్వడంతో అతడి మాటలు నమ్మింది. మొదటి భర్తను వదిలేసి ప్రవీణ్ వెంట వెళ్లింది. కొన్నాళ్లు ఇద్దరూ బాగానే ఉన్నప్పటికీ, చాందినీపై ప్రవీణ్ అనుమానం పెంచుకున్నాడు.

Read Also- Accident Video: ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరిపడ్డ బాధితులు

ఆ ఏడాది ఆగస్టు నెలలో భార్యను ఐరన్ రాడ్‌తో కొట్టి చంపాడు. ఆ తర్వాత పిల్లల్ని కూడా వదల్లేదు. చాందిని మొదటి భర్తకు పుట్టిన అయాన్ అనే పిల్లాడిని అదే రాడ్డుతో దారుణంగా కొట్టి ప్రాణాలు తీశాడు. ఇక, తనకు పుట్టిన ఏంజెల్ అనే చిన్నారిని ప్రవీణ్ గొంతునులిమి చంపేశాడు. అనంతరం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. రైల్వే స్టేషన్ వైపు వెళుతున్న అతడు, హత్య విషయాలను చెప్పేందుకు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లాడు. విషయాన్ని చెప్పిన వెంటనే పోలీసులు స్పందించి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రవీణ్, చాందిని వికారాబాద్‌లో నివాసం ఉంటున్న సమయంలో ఈ దారుణం జరిగింది.

Just In

01

Bowrampet Land Dispute: బౌరంపేట్‌లో బడాబాబుల భూ మాయ‌.. పెద్దలకు వత్తాసు పలుకుతున్న మున్సిపాలిటీ రెవెన్యూ?

Trivikram Venkatesh: వెంకీమామ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ ఇదే!

Minister Sridhar Babu: తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మహిళల కీలక పాత్ర : మంత్రి శ్రీధర్

Rumour Controversy: వారి బ్రేకప్‌ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటున్న కొరియోగ్రాఫర్ నందికా ద్వివేది..

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి