MLC Under MLA Quota
తెలంగాణ

MLC Under MLA Quota: ఎమ్మెల్సీగా రాములమ్మ.. ఐదుకు ఐదు ఏకగ్రీవం

MLC Under MLA Quota: తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కగా వాటిలో ఒకటి పొత్తులో భాగంగా సీపీఐకి వెళ్లింది. ఫలితంగా కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లు.. సీపీఐ నుంచి సత్యం ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవమయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ కు ఒక స్థానం లభించగా.. ఆ పార్టీ నుంచి దాసోజు శ్రావణ్ ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు.

6 నామినేషన్స్ తిరస్కరణ
వాస్తవానికి కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ నేతలతో పాటు మరో ఆరుగురు సైతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం కోసం నామినేషన్ వేశారు. అయితే అవి ఎన్నికల సంఘం సూచించిన నిబంధలనకు అనుగుణంగా లేకపోవడంతో వాటిని తొలగించినట్లు ఈసీ ప్రకటించింది. గురువారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతోపాటు ఐదు స్థానాలకు ఐదు నామినేషన్స్ ఉండటంతో వారినే ఏకగ్రీవం చేస్తూ రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Heatwave Alert: మండిపోతున్న తెలంగాణ.. ఇవేమి ఎండలు బాబోయ్!

నల్గొండ వారే నలుగురు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపికైన వారిలో విజయశాంతి మినహా మిగిలిన నలుగురు ఎమ్మెల్సీలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలు కావడం విశేషం. అయితే తొలి నుంచి ఈ నామినేషన్ ఏకగ్రీవం అవుతుందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షంగా మారాయి.

ఇవి కూడా చదవండి:

Nagam Janardhan – Chandrababu: నాగంలో ఇంత మార్పేంటి? చంద్రబాబుతో భేటీ అందుకేనా?

Geetha Arts: ఈ దర్శకుడిని గీతా ఆర్ట్స్ వదిలిపెట్టదా? మరొకటి సెట్ చేశారుగా!

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?