VH-Fall (Image source Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

VH Fall Video: బీసీ బంద్‌లో బొక్కబోర్లా పడ్డ వీహెచ్.. వీడియో వైరల్

VH Fall Video: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపీ వీ హనుమంతరావు శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘బీసీ బంద్‌’లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంబర్‌పేట్‌లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రోడెక్కారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ నినాదించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగిరావాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే, ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో ఒకచోట ఆయన అనూహ్యంగా కిందపడ్డారు.

ర్యాలీలో ముందు వరుసలో ఉన్న కాంగ్రెస్ నేతలు పొడవాటి బ్యానర్ చేతపట్టుకొని నడుస్తున్న క్రమంలో, వీ హనుమంతరావు ముందడు నడుస్తూ బ్యానర్‌ను తొక్కారు. ఆ తర్వాత అడుగు ముందుకు పడకపోవడంతో బ్యాలెన్స్ నిలుపుకోలేకపోయారు. ఒక్కసారిగా ముందుకు బొక్కబోర్లా కింద (VH Fall Video) పడ్డారు. ఆయన ముఖం, ఉదర భాగంగా నేలను తాకాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హనుమంతరావు కిందపడిన వెంటనే, కాంగ్రెస్ శ్రేణులు ఆయనను పైకి లేపారు. అయితే, ఈ ఘటనలో హనుమంతరావు స్వల్పంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. దీంతో, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన ర్యాలీలో పాల్గొన్నారు.

Read Also- Attack on Petrol Bunk: పెట్రోల్ బంక్‌పై దాడి.. తెలంగాణ బంద్‌లో అనూహ్య ఘటన

కాగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ అంబర్‌పేట్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో వీహెచ్‌తో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీతో పాటు పలు బీసీ సంఘాల నాయకులు, అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ఈ ర్యాలీలో కనిపించారు.

పార్టీలకు అతీతంగా బంద్‌లో నేతలు

బీసీ బంద్‌లో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి వాకాటి శ్రీహరి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్‌ కృష్ణయ్యతో పాటు పలు బీసీ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. బీజేపీ తరపున ఈటల రాజేందర్‌తో పాటు పలువురు ముఖ్యనాయకులు, బీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాసయాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస గౌడ్ వంటి నేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ నినాదం చేస్తున్న ఎమ్మెల్సీ ఎంఎల్సీ కవిత కూడా పాల్గొన్నారు. ఆటోలో వచ్చి ఖైరతాబాద్ చౌరస్తాలో నిరసన తెలిపారు. జాగృతి శ్రేణులతో కలిసి మానవహారాన్ని నిర్వహించారు.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!