Ramchender Rao: ఈ నెల 17న వాజ్ పేయి విగ్రహం ఆవిష్కరణ
Ramchender Rao (imagecredit:swetcha)
Telangana News

Ramchender Rao: ఈ నెల 17న వాజ్ పేయి విగ్రహం ఆవిష్కరణ.. ఎక్కడంటే..?

Ramchender Rao: కంటోన్మెంట్ పార్కులో దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 17 సెప్టెంబర్.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day) పురస్కరించుకుని విజయవంతం చేయడంపై హైదరాబాద్‌లోని బర్కత్ పుర సిటీ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchender Rao) ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బీజేపీ అనేక పోరాటాలు

సెప్టెంబర్ 17 వేడుకల కోసం సమగ్ర ప్రణాళిక, భద్రతా ఏర్పాట్లు, కంటోన్మెంట్ పార్కులో దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయి(Vajpayee) విగ్రహావిష్కరణ, ఇతర కార్యక్రమాల షెడ్యూల్ పై రాంచందర్ రావు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. నిజాం, రజాకార్ల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ఉమ్మడి ఏపీ మొదలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) నిరాకరించాయని విమర్శలు చేశారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అనేక పోరాటాలు చేసిందన్నారు. అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వం విస్మరించడంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి ప్రతి ఏటా అధికారికంగా విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోందన్నారు.

Also Read: Bhatti Vikramarka: గుడ్ న్యూస్.. త్వరలో హెల్త్ ఎంప్లాయిస్ స్కీమ్ గైడ్ లైన్స్

ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి

2022, 2023లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Minister Amit Shah) చీఫ్​ గెస్ట్ గా వచ్చారని, 2024లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారని తెలిపారు. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) వస్తున్నట్లు రాంచందర్ రావు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay), మహారాష్ట్రకు చెందిన మంత్రులు హాజరవుతారన్నారు. ఈ వేడకల్లో భాగంగా తెలంగాణ స్వాతంత్ర్య పోరాట యోధుల గాథలు, ఉద్యమ కథలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

Also Read: STP Projects: కొత్త ఎస్టీపీలపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష.. ఆదేశాలు జారీ..?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..