Uttam Kumar Reddy( image credit: swtcha reporter)
తెలంగాణ

Uttam Kumar Reddy: ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై కలెక్టర్లతో.. మంత్రి కీలక సమీక్ష‌!

Uttam Kumar Reddy: యాసంగి 2024 -25 సీజన్ ‌‌‌‌‌‌‌లోనూ రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైంది. రాష్ట వ్యాప్తంగా 60.14 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు జరగగా, 129.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి నమోదయ్యే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోళ్లను లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోని 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ లక్ష్యం నిర్ణయించింది. ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేసింది.

2023 రబీ సీజన్ లో మే15 నాటికి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రబీ సీజన్ లో అదే మే 15 నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేశారు.
ముందెన్నడూ లేని రీతిలోపెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రెట్టింపు స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి.

 Also Read; Anasuya Bharadwaj: అనసూయలో ఈ యాంగిల్ కూడా ఉందా.. తొలిసారి చూస్తున్నామంటూ కామెంట్స్!

ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలకు 8,348 కొనుగోలు కేంద్రాలు ఏర్పటు చేసింది. 2021-22 రబీ సీజన్ తో పోలిస్తే ఈ రబీ సీజన్ లో అధికంగా1,739 కేంద్రాలు అధికం. ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో పెరగడంతో కొనుగోలు కేంద్రాల పెంపు ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందిని తెలియజేస్తూ, రైతుల అభీష్టానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తామని అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. కొనుగోళ్ల ప్రక్రియను కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  తెలిపారు.

రానున్న 10,12 రోజులు కొనుగోళ్ల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో లోపాలు గుర్తించి సత్వరమే పరిష్కరించాలి.ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలసని, నిజానిజాలు ప్రజలకు వెల్లడించి బహిర్గతం చేసి రైతులకు భరోసా కల్పించడంలో కలెక్టర్లు చొరవ తీసుకోవాలి.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు