Uttam Kumar Reddy(image credit:X)
తెలంగాణ

Uttam Kumar Reddy: ఏపీ నీటి దోపిడీకి టెలిమెట్రి ఏర్పాటు చేయాలి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!

Uttam Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా నుంచి అక్రమంగా జలాలను తరలిస్తోందని కట్టడికి టెలిమెట్రి ఏర్పాటు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు వెంటనే నీటి కేటాయింపులు చేయాలని కోరారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్ అతుల్ జైన్ తో ఢిల్లీలో గురువారంభేటీ అయ్యారు. మేడిగడ్డ, సమ్మక్క సారక్క, పాలమూరు-రంగా రెడ్డి ప్రాజెక్టులపై చర్చించారు.

మేడిగడ్డ డ్యామ్ కూలిపోవడం పై జాతీయ డామ్ సంరక్షణ సంస్థ(ఎన్.డీ.ఎస్.ఏ) నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ పై చర్చించారు. సమ్మక్క, సారక్క, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, కృష్ణానది పై పలు చోట్ల టెలిమెట్రి పరికరాలు ఏర్పాటు అంశం పై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ ప్రభావానికి తెలంగాణలోని పలు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాధనంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్‌ పునరుద్దరణ కు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించడం లేదన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ ఫౌండేషన్‌, టెక్నాలజీ, డిజైన్‌, నిర్మాణం, ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ లోపాలు ఉన్నాయని తాజాగా నేషనల్‌ డ్యాం సేప్టీ అథారిటీ-(ఎన్డీఎస్‌ఏ) రిపోర్ట్‌ లో వెల్లడించిందన్నారు. వర్షాలు వచ్చే లోగా సాధ్యమైనంత వరకు బ్యారేజ్‌ పునరుద్దరణ చర్యలు చేపడతామన్నారు.

మేడిగడ్డ బ్యారేజ్‌ పై సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ తో సంప్రదింపుల తర్వాత ముందుకు వెళ్లాలని రిపోర్ట్‌ లో సూచించిందని వెల్లడించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌ లో ఏవిధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ఇప్పటికే ఫార్మల్‌ గా చర్చించామన్నారు. మేడిగడ్డ రాష్ట్ర ప్రభుత్వ ప్రపోజల్‌, ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఇస్తే.. కావాల్సిన సలహాలు, సూచలను చెప్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.

Also read: Khans of Bollywood: ‘ఆపరేషన్‌ సింధూర్’పై ఒక్క ఖాన్ కూడా స్పందించలే.. వీళ్లు మనకి అవసరమా?

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మేడిగడ్డ దగ్గర 100 మీటర్లు, తుమ్మడిహట్టి దగ్గర 148 మీటర్ల బ్యారేజ్‌ నిర్మిస్తామని మాట ఇచ్చి తప్పిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్ట్‌ నిర్మిస్తామని చెప్పారు.
కరువు పీడిత జిల్లాలైన మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌, రంగారెడ్డి, నల్గొండలలో సుమారు 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పాలమూరు- రంగారెడ్డి లెప్ట్‌ స్కీం ను చేపట్టనున్నట్లు వెల్లడించారు. కృష్ణా నది నుంచి రోజుకు 2 టిఎంసి నీటిని ఎత్తిపోయడానికి ఐదు పంపింగ్‌ స్టేషన్ల ఉపయోగించనున్నట్లు వివరించారు.

ఈ ప్రాజెక్ట్‌ కు మొత్తం 90 టీఎంసీల నీటి కేటాయింపులు చేయాలని, మైనర్‌ ఇరిగేషన్‌ సేవింగ్స్‌ లో భాగంగా ఫస్ట్‌ ఫేజ్‌ లో 45 టీ-ఎంసీలు ఈ ప్రాజెక్ట్‌ కు ఇవ్వాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ను కోరామన్నారు. ములుగు జిల్లాలోని సమ్మక్క-సారక్క బ్యారేజీకు 44 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు.

పోలవరం బ్యాక్‌ వాటర్‌, కృష్ణా పై టెలిమెట్రి పరికరాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఈటెలిమెట్రి విధానంతో ఏపీ, తెలంగాణ వాడుకుంటోన్న నీటి కేటాయింపులను లెక్కించాలని కోరారు. రాష్ట్ర నీటి వాటానుకాపాడుకునేందుకు మా ప్రభుత్వం ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. టెలిమెట్రి సిస్టం ఏర్పాటుకు కొన్ని నిధుల్ని కృష్ణ రివర్‌ మెనేజ్మెంట్‌ బోర్డు(కెఆర్‌ఎంబీ) కి కేటాయించినట్లు చెప్పారు.

ఈ నిధులతో తక్షణమే కృష్ణా రివర్‌ పై టెలిమెట్రీసిస్టం ఏర్పాటు చేయాలని కోరామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ తో తెలంగాణ ప్రాంతంలో కొంత ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. దీనిపై క్షుణ్నంగా అధ్యయనం చేసి తెలంగాణ కు నష్టం జరగకుండ చర్యలు చేపట్టాలన్నారు. దానికి రిటెన్షన్ వాల్ ను నిర్మించాలని చైర్మన్ ను కోరారు.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు