Minister Jitender Singh: వ్యవసాయంలో శాస్త్రీయంగా ఆర్గానిక్ పద్ధతులు అవలంబించాలని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అన్నారు. విత్తనమే ప్రధానంగా వ్యవసాయంలో వచ్చే సమూల మార్పులతో పాటు సేంద్రియ ఎరువులు వాడేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి సేంద్రీయ రైతు సమ్మేళనం రెండవ రోజు శుక్రవారం శంకర్ పల్లి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్ర మంత్రి జితేందర్ సింగ్ హాజరై మాట్లాడారు.
Also Read: Mega Job Mela: నిరుద్యోగులకు పోలీసులు భరోసా.. రూ.30 వేలకు పైగా జీతంతో మెగా జాబ్ మేళా!
వ్యవసాయానికి డిగ్రీ పట్టాలు అవసరం లేదని, చదువు లేని వారు కూడా సేంద్రియ వ్యవసాయం చేసి అభివృద్ధి చెందవచ్చని సూచించారు. ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం దిశగా అడుగు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రసాయన ఎరువుల వాడకం పెరిగిపోవడంతో భూసారం దెబ్బతింటుందని, భూమి ఆరోగ్యాన్ని కాపాడడానికి మన పూర్వీకులు ఆచరించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించాలని సూచించారు. ప్రకృతి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఏకలవ్య ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ పై హైటెక్ కుట్రలు.. ఫేక్ వీడియోల హల్ చల్.. నెటిజన్స్ ఫైర్..
రసాయనిక ఎరువులు వాడటం వలన లివర్ క్యాన్సర్, వంటి రోగాలు ఉత్పన్నం అవుతుండటం ఆందోళన కలిగించే విషయమన్నారు. కార్యక్రమంలో గ్రామీణ వికాస్ ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యేల యాదయ్య, విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి, వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు