Panchayat Secretaries: రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసింది. కానీ పంచాయతీకార్యదర్శులను మాత్రం మున్సిపాలిటీల్లో ఉద్యోగులుగా తీసుకోలేదు. వారికి ఇప్పటికీ పంచాయతీరాజ్ శాఖ(Panchayat Raj Department) నుంచి వేతనాలు ఇస్తున్నారు. ఈ ఉద్యోగులను మున్సిపల్ శాఖ ఉద్యోగులుగా పరిగణించకపోతే భవిష్యత్ లో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సర్వీసును కూడా కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం గెజిట్ సైతం
పరిపాలన సౌలభ్యం కోసం, మరోవైపు మేజర్ గ్రామపంచాయతీలను కొన్నింటిని మున్సిపాలిటీ(Muncipality)గా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 148 గ్రామపంచాయతీలను మున్సిపాలిటీల్లో కలిపింది. గతేడాది సెప్టెంబర్ లో ఓఆర్ఆర్(ORR) పరిధిలో ఉన్న 51 గ్రామపంచాతీలు మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. ఆ గ్రామాలు మేడ్చల్(Medchel), రంగారెడ్డి(Ranga Reddy), సంగారెడ్డి(Sanga Reddy) జిల్లాలకు చెందిన గ్రామాలు ఉన్నాయి. మిగిలిన గ్రామాలు రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన గ్రామపంచాయతీలు ఉన్నాయి. అందుకు ప్రభుత్వం గెజిట్ సైతం ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ గ్రామపంచాయతీ కార్యదర్శులను మాత్రం మున్సిపాలిటీ ఉద్యోగులుగా తీసుకోలేదు. దాదాపు ఏడాది గడుస్తున్నప్పటికీ ఉద్యోగుల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కార్యదర్శులు ఆందోళనకు గురవుతున్నారు.
6 నెలలుగా వేత్తనాలు ల్లేవ్
ప్రభుత్వం కీసర, ఘట్ కేసర్ మున్సిపాలిటీల్లో సమీపంలోని గ్రామాలను విలీనం చేసింది. ఆ గ్రామాల్లో కార్యదర్శులుగా పనిచేస్తున్న వారంతా ప్రస్తుతం మున్సిపాలిటీల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. కానీ కార్యదర్శులకు మాత్రం ఇటు పంచాయతీరాజ్ శాఖ గానీ, అటు మున్సిపల్ శాఖ నుంచి గానీ సుమారు 6నెలలుకు పైగా వేతనాలు ఇవ్వడం లేదు. ఎప్పుడు ఇస్తారో అనే దానిపై క్లారిటీ లేదు. ఎవరిని అడగాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మరోవైపు కొన్ని గ్రామపంచాయతీల గ్రామకార్యదర్శులు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నప్పటికీ వారికి పంచాయతీరాజ్ శాఖ నుంచే వేతనాలు ఇస్తున్నారు. దానిని కంటిన్యూ చేస్తారా? లేదా? అనే అంశంపై క్లారిటీ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
Also Read: Kishan Reddy: రాజకీయాల్లో మేం శత్రువులం కాదు.. ప్రత్యర్థులమే: కిషన్ రెడ్డి
వార్డు ఆఫీసర్ పోస్టు అంటూ ప్రభుత్వం నోటిఫికేషన్
మున్సిపాలిటీల్లో విలీనం అయిన గ్రామపంచాయతీ కార్యదర్శులకు డిగ్రీ(Degree) అర్హత ఉంది. వారికి ప్రభుత్వం గ్రూప్-4 ఉద్యోగులుగా పరిగణిస్తుంది. అయితే గత ప్రభుత్వం వీఆర్ఏ(VRA) లకు ప్రమోషన్లతో జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఇస్తూ వార్డు ఆఫీసర్స్ పోస్టు ఇస్తున్నారు. అదే డిగ్రీ అర్హత ఉన్న పంచాయతీకార్యదర్శులకు వార్డు ఆఫీసర్స్ పోస్టు ఇస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇవ్వకుండా వార్డు అఫీసర్ పోస్టు ఇచ్చి కార్యదర్శులను మానసికంగా ఇబ్బందులు గురిచేయడమేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శులను ప్రభుత్వం ఏం చేస్తుందో అర్ధం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం నుంచి నో అప్రూవల్?
మున్సిపాలిటీలో విలీనం అయిన గ్రామపంచాయతీ కార్యదర్శులను మున్సిపాలిటీల్లోకి తీసుకుంటారా? లేదా? అనేదానిపై స్పష్టత కొరవడింది. దీనిపై పలుమార్లు ఉన్నతాధికారులకు కార్యదర్శులు వినతులు అందజేశారు. కానీ స్పందన కరువైంది. ప్రభుత్వం నుంచి అప్రూవల్ రాగానే ఉద్యోగుల మెర్జ్ పై నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Redddy) ఓఆర్ఆర్(ORR) లోపల ఉన్న ఉద్యోగులను జీహెచ్ఎంసీ(GHMC)లో మెర్జ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు ఉద్యోగులపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో తమ సీనియార్టీ కూడా పోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నామని ఆసర్వీసును అందులో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Min Seethakka) అయినా కార్యదర్శుల మెర్జ్ పై చొరవ తీసుకుంటారా? లేదా అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Mother kills daughter: రాష్ట్రంలో ఘోరం.. 3 ఏళ్ల కూతుర్ని చంపి తల్లి కూడా.. కారణం తెలిస్తే షాకే!