Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులోని తాజా పరిణామం బీఆర్ఎస్వర్గాల్లో గుబులు రేపుతోంది. విచారణలో ప్రభాకర్ రావు ఏం చెప్తారో? ఎవరెవరి మెడకు ఈ వ్యవహారం చుట్టుకుంటుందో? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. క్రితంసారి జరిగిన ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డిన విషయం తెలిసిందే. అయితే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టారు. ఆ తరువాత ప్రజా పాలన ప్రారంభమైన కొన్నాళ్లకే వెలుగు చూసిన ఫోన్‌ట్యాపింగ్ ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ప్రభుత్వంలోని కొందరు పెద్దల ఆదేశాల మేరకే అప్పట్లో ఎస్ఐబీ ఛీఫ్‌గా ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ట్యాపింగ్వ్యవహారాన్ని నడిపించినట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో పీసీసీ అధ్యక్షునిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు, వారి బంధుమిత్రులతోపాటు పలువురు పారిశ్రామిక వేత్తలు, చివరకు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి.
రూంలు పెట్టి మరీ ఫోన్ ట్యాపింగులు
ఇక, ఈ కేసులో మొదటగా అరెస్టయిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును జరిపిన విచారణలో సంచలన వివరాలు వెలుగు చూశాయి. కేసు విచారిస్తున్న బృందంలోని ఓ అధికారి తెలిపిన ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు పోటీ చేసిన అసెంబ్లీ సెగ్మెంట్లలో వార్ రూంలు పెట్టి మరీ ఫోన్ ట్యాపింగులు చేశారు. వీలు పడని చోట్ల వాహనాల్లో ఫోన్‌ట్యాపింగ్ పరికరాలను అమర్చి వ్యవహారాన్ని నడిపించారు. ఇదంతా ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పర్యవేక్షణలోనే నడిచింది. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేసిన పాలకుర్తి నియోజకవర్గంలో ఏకంగా విజిలెన్స్ విభాగంలో పని చేసిన ఓ అధికారి ఇంట్లో వార్‌రూం పెట్టి కాంగ్రెస్అభ్యర్థి యశస్వినీ రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డితోపాటు పలువురి ఫోన్లను ట్యాప్చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డితోపాటు పలు నియోజకవర్గాల్లో ఈ వ్యవహారాన్ని నడిపించారు.
Also Read: MLA Mallareddy: ఇదేందయ్యా ఇది.. టైమ్ ట్రావెల్ చేసిన మల్లారెడ్డి.. బుద్ధుడితో భేటి!
ఫోన్‌ట్యాపింగ్ పరికరాలు ఇజ్రాయిల్
దాంతోపాటు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో కూడా ఇలాంటి వార్‌రూంను నడిపించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే బీఆర్ఎస్లోని కొందరు నాయకులతోపాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురి ఫోన్లను కూడా ట్యాప్ చేయటం. కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్న పలువురు పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారులను కూడా టార్గెట్ చేయటం. ఈ క్రమంలో ముప్పయి మందికి పైగా నగల వ్యాపారులు, రియల్టర్లు, నిర్మాణ కంపెనీల ప్రతినిధులను బెదిరించి పెద్ద మొత్తాల్లో డబ్బు కూడా వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఫోన్ట్యాపింగ్కోసం అవసరమైన పరికరాలను ఇజ్రాయిల్నుంచి తెప్పించుకున్నట్టుగా వెల్లడైంది.
ప్రభాకర్‌రావు పెదవి విప్పితే!
ఈ నేపథ్యంలోనే ప్రభాకర్‌రావు సిట్విచారణకు హాజరు కానుండటం బీఆర్ఎస్ వర్గాల్లో కలవరాన్ని కలిగిస్తోంది. ఈ కేసులో అరెస్టయిన ప్రణీత్‌రావు తనకు పై అధికారుల నుంచి ఫోన్ నెంబర్లు వచ్చేవని, వాటిని ట్యాప్‌చేసి ఎప్పటికప్పుడు వివరాలను వారికే పంపించే వాన్నని వెల్లడించారు. ఆ పై అధికారుల్లో ఒకరు ప్రభాకర్‌రావు అని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు పెదవి విప్పితే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లను ట్యాపింగ్ చేయించారన్నది స్పష్టమవుతుందని అంటున్నారు. ట్యాప్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు ఎవరిచ్చేవారు? అన్నది తేలుతుందని చెబుతున్నారు.
Also Read:AP Politics: ప్రజా జీవితంలో ఫెయిల్ అయ్యిందెవరు.. జగన్ వర్సెస్ లోకేష్!