Jobs In TGSRTC (image credit:Twitter)
తెలంగాణ

Jobs In TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఖాళీల వివరాలివే

Jobs In TGSRTC: త్వరలోనే ఆర్టీసీ లో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనితో ఆర్టీసీలో ఖాళీల భర్తీ కోసం ఎదురుచూపుల్లో ఉన్న అభ్యర్థులకు ఇదొక గొప్ప అవకాశమనే చెప్పవచ్చు. ఈ మేరకు పొన్నం ట్వీట్ చేశారు. మరెందుకు ఆలస్యం.. ఆ ఉద్యోగాల వివరాలు తెలుసుకుందాం.

త్వరలోనే ఆర్టీసీ లో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీ లో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. 3038 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని త్వరలోనే నోటిఫికేషన్ వేసి సాధ్యమైనంత త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం ఆర్టీసీ లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని దీని ద్వారా ఆర్టీసీ లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఆర్టీసీ లో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని వారు 5500 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు పేర్కొన్నారు.ఇప్పటికే మహా లక్ష్మి కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధం అయిందని పేర్కొన్నారు.

ఖాళీల వివరాలు ఇవే..
డ్రైవర్ -2000, శ్రామిక్ -743, డిప్యూటీ సూపరిండెంట్ (ట్రాఫిక్) – 84, డిప్యూటీ సూపరిండెంట్ (మెకానికల్) – 114, డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 18, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23, సెక్షన్ ఆఫీసర్ ( సివిల్) -11, అకౌంట్ ఆఫీసర్స్ – 6, మెడికల్ ఆఫీసర్స్ జనరల్ – 7, మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ – 7

Also Read: Smiley Moon: 25న ఆకాశంలో మరో అద్భుతం.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ఎప్పుడో!

పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ప్రజా పాలన ప్రభుత్వం లో నిరుద్యోగులకు పెద్ద పీఠ వేస్తూ దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఇప్పుడు మరోసారి భారీస్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు క్యాలండర్ ప్రకారం విడుదల చేయనుందని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని బాగా ప్రిపేర్ కావాలని సూచించారు. ఆర్టీసీ లో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు