TGSRTC(image credit:X)
తెలంగాణ

TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో అలంకార ప్రాయంగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు.. పట్టించుకోని అధికారులు!

TGSRTC: ఇటీవల నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సుకు ఓ వాహనం అకస్మాత్తుగా అడ్డుగా రావడంతో డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పౌరసరఫరాల శాఖ ఎన్‌ ఫోర్స్‌మెంట్ డిఫ్యూటీ తహసిల్దార్‌ ఒకరు బస్సులోనే కింద పడిపోయారు. తలకు తీవ్ర గాయమై రక్త స్రావం కాగా.. పది కిలోమీటర్లు కర్చీఫ్‌ను అడ్డుగా పెట్టుకుని హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి వారం రోజుల తర్వాత డిశ్చార్జి అయ్యారు.

ఇంకాస్త ఆలస్యమైతే.. కోమాలోకి వెళ్లే ప్రమాదం ఏర్పడి ఉండేదని వైద్య నిపుణులు ఆయనకు సూచించారు. ఇలాంటి ఘటనలు అడపాదడపగా ఆర్టీసీ బస్సుల్లో అక్కడక్కడా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కానీ అధికారులు స్పందించడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్‌ కిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం లేదు.

ప్రయాణికుల భద్రత ఒట్టిదేనా

ఆర్టీసీ ప్రయాణం సురక్షితం.. సుఖ వంతం అనేది నినాదానికే పరిమితమవుతోంది. సంస్థ ప్రయాణికుల భద్రతను పట్టించుకోవడం లేదు. కనీసం బస్సుల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రథమ చికిత్స పరికరాలనైనా ఏర్పాటు చేయడం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిత్యం లక్షలాది మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.

Also read: IPL 2025: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. ఐపీఎల్ జరుగుతుందా? లేదా?

గుంతల ప్రాంతాల్లో బస్సులు పరుగులు తీస్తున్నప్పుడు, సడన్‌గా ఏదైనా వాహనం అడ్డుగా వచ్చినప్పుడు బ్రేక్‌ వేస్తున్న సందర్భాల్లో ప్రయాణికులు పడిపోతున్నారు. దీంతో గాయమై రక్తస్రావం అవుతున్నప్పటికీ ప్రథమ చికిత్స చేసేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్‌ కిట్లు ఉండడం లేదు. దీంతో ఆసుపత్రులకు వెళ్లే వరకు కూడా వారికి చికిత్స అందే పరిస్థితి ఉండడం లేదు.

తీవ్ర రక్తస్రావం అయితే పరిస్థితి ఏంటన్నది? సందేహాస్పదమవుతోంది. కొన్ని ఆర్టీసీ బస్సుల్లో చూద్దామన్నా, ఫస్ట్ ఎయిడ్‌ బాక్స్​​‌లు కనిపించడం లేదు. కొన్నింటికి బాక్స్​​‌లు ఉన్నప్పటికీ వాటిలో ప్రథమ చికిత్సకు అవసరమైన వస్తువులేవీ ఉండక అలంకార ప్రాయంగా ఉంటున్నాయి. టించర్‌ అయోడిన్‌, యాంటిసెప్టిక్‌ క్రీం, దూది, కత్తెరతోపాటు కట్టు కట్టేందుకు కాటన్‌ బ్యాండేజ్‌ ఏర్పాటుకు ఆర్టీసీకి అయ్యే వ్యయం కూడా తక్కువే.

కానీ వీటి ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రయాణిలకు భద్రత అనేది లేకుండా పోతోంది. బాధితులు అనేక సందర్భాల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం ఉండడం లేదు. ఇకనైనా అధికారులు ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్‌ కిట్లను అందుబాటులో ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?