Nagi Reddy on Fire Department: అగ్నిమాపక శాఖలో డెయిలీ స్టేటస్ రిపోర్ట్ ను డిజిటలైజ్ చేయడం వల్ల ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తెలంగాణ ఫైర్ డిపార్ట్ మెంట్ నిలిచిందని టీజీఎఫ్డీ డీజీ వై నాగిరెడ్డి స్పష్టంచేశారు. అగ్నిమాపక శాఖలో జరుగుతున్న రోజూ వారీ అప్ డేట్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నామని ఆయన వివరించారు. హైదరాబాద్ లో 45వ స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం కొనసాగింది. కాగా 44వ సమావేశంలో వివిధ అంశాలపై 9 సబ్ కమిటీలు ఏర్పాటుచేశారు.
ఆ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రాల్లో అగ్నిమాపక సేవల విస్తరణ, ఆధునీకరణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2023లో రూ.5000 కోట్లు కేటాయించిందని ప్రస్తావించారు. ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి అదే ఏడాదిలో ముంబై, గౌహతిలో రెండు వర్క్‌షాప్‌లు నిర్వహించి ఒక ఫార్మాట్‌ను రూపొందించినట్లు తెలిపారు. 2023 అక్టోబర్ 11న అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలని సూచించారని ప్రస్తావించారు.
కాగా ఆధునీకరణ, సేవల విస్తరణకు కేటాయించిన మొత్తంలో ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ కింద 30 శాతం నిధులు కేటాయించగా మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడంలో ముందస్తు దశలో ఉన్నాయని చర్చించారు. ఆల్ ఇండియా ఫైర్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్, పార్కింగ్ సమస్యలు, ఎత్తైన, వాణిజ్య భవనాల సంఖ్య పెరుగుదలతో పార్కింగ్ సవాళ్లను అధిగమించడం, వాహనాలను రోడ్డుపై పార్క్ చేయడం వలన అగ్నిమాపక వాహనాల కదలిక ఆలస్యమవ్వడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం వై నాగిరెడ్డి మాట్లాడుతూ.. వివిధ పరిపాలనా స్థాయిల్లో అగ్నిమాపక కేంద్రాల కోసం రిపోర్టింగ్ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని, మోడల్ గా నిలిచిందని కొనియాడారు.
Also read: Warangal Job Mela: వరంగల్ జాబ్ మేళాపై కీలక అప్ డేట్.. వారికి జాబ్స్ పక్కా!
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆమోదించిన నాణ్యమైన అగ్నిమాపక పరికరాల సంస్థాపనకు, అగ్నిమాపక పరికరాల ఆడిట్ నిర్వహణకు ఎంప్యానెల్మెంట్, దాని నియంత్రణ కోసం ఒక పథకాన్ని సిద్ధం చేసినట్లు తెలతిపారు. ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి అన్ని సబ్ కమిటీలు తమ నివేదికను సమర్పించాయని వెల్లడించారు.
ఆ అంశాలపై చర్చించామని, కౌన్సిల్ ఆమోదం కూడా లభించిందని వివరించారు. దీంతో పాటు చట్టపరమైన సమస్యలు, సంస్థాగత సమస్యలు, శిక్షణ సమస్యలు, డిజిటలైజేషన్ సమస్యలపై రాష్ట్రాలతో పాటు యరూటీలు లేవనెత్తిన దాదాపు 100 కొత్త ఎజెండా అంశాలపైనా చర్చ జరిగిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అగ్నిమాపక, అత్యవసర సేవల మెరుగుదల కోసం కౌన్సిల్ పలు ముఖ్యమైన నిర్ణయాలను సిఫార్సు చేసిందని నాగిరెడ్డి వివరించారు.