తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: TG Sub Registrar office: భూముల రిజిస్ట్రేషన్ అవసరాల నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మార్చి 31న తెరిచే ఉంటాయని ఆ శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు. పెనాల్టీలో 25% రిబేట్‌తో ఎల్ఆర్ఎస్ (లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోడానికి ప్రభుత్వం విధించిన గడువు మార్చి 31న ముగుస్తున్న నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకున్నది.
Also Read: TG Power Generation Plants: తెలంగాణ సరికొత్త రికార్డ్.. ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి
తొలుత ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రభుత్వ సెలవులు దినాలుగా ఉన్న మార్చి 30, 31 తేదీల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మూసివేసి ఉంటాయి. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వీలుగా మార్చి 31న ‘వర్కింగ్ డే’గా ప్రకటించాలని వివిధ సెక్షన్ల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకుని ‘హాలీ డే’ను రద్దు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు