TG Govt Doctors(image credit:X)
తెలంగాణ

TG Govt Doctors: ఉస్మానియా, గాంధీలోని ఖాళీలు భర్తీ చేయండి!

TG Govt Doctors: వైద్యారోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్​ పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ప్రమోషన్లు కల్పించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు  హెల్త్ సెక్రటరి క్రిస్టినా జెడ్ చొంగ్తూను ప్రత్యేకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరహరి, డాక్టర్ లాలూ ప్రసాద్, డాక్టర్ రవూఫ్​ లు మాట్లాడుతూ…తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను సెకండరీ హెల్త్ గా మార్చాలన్నారు.

దీని వలన ఎలాంటి ఫైనాన్స్ సమస్య ఉండదన్నారు. ఏపీలో ఇప్పటికే చేశారని, తెలంగాణలోనూ పూర్తి చేయాలని కోరారు. ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఫెరిఫెరల్ మెడికల్ కాలేజీల అలయెన్స్ ఇవ్వాలన్నారు. డీహెచ్ లో టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. అన్ని మెడికల్ కాలేజీల్లో స్టాఫ్​ సంపూర్ణంగా ఉంటేనే, ప్రజలకు మరింత ఈజీగా వైద్యసేవలు అందుతాయని వివరించారు. గవ్ట్ డాక్టర్స్ పెట్టిన ప్రపోజల్ కు హెల్త్ సెక్రటరీ సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్లు తెలిపారు.

Also read: Tummala Nageswara Rao: ఎర్లీ వార్నింగ్ సిస్టంతో రైతులకు మేలు.. అధికారులను ఆదేశించిన మంత్రి!

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!