Ramzan Holidays: ఒకరోజు కాదు.. రెండు రోజులు.. ప్రభుత్వం తాజా ప్రకటన ఇదే!
Ramzan Holidays: (Image credit:AI)
Telangana News

Ramzan Holidays: ఒక్కరోజు కాదు.. రెండు రోజులు.. ప్రభుత్వం తాజా ప్రకటన ఇదే!

Ramzan Holidays: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్(ఈదుల్ ఫితర్) సందర్భంగా మార్చి 31వ తేదీతో పాటు, ఏప్రిల్ 1వ తేదీన కూడా సెలవు ప్రకటించింది. అలాగే జమాతుల్-విదాను పురస్కరించుకుని మార్చి 28న ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించగా.. మైనారిటీ విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. దీంతో పాటు.. విద్యార్థులు, ఉద్యోగులకు ఆదివారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం రంజాన్ పండుగ వేళ శుభవార్తను ప్రకటించింది. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ నేపథ్యంగా వరుసగా రెండు రోజులు సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ పని దినాల ప్రకారం మార్చి 31వ తేదీన ఈదుల్ ఫితర్ (రంజాన్) పండుగను జరుపుకోనున్నారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు, ఆఫీస్‌లకు సెలవు ఉండనుండగా.. తర్వాత రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీన కూడా సెలవు ప్రకటించింది.

Also Read : ప్రేమ పేరుతో బరితెగించిన విద్యార్థి.. 32 ఫేక్ ఐడీలతో వేదింపులు

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మార్చి 2 నుండి మార్చి 31 వరకు దుకాణాలు, సంస్థలు 24 గంటలు తెరిచి ఉంచడానికి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే.. ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలు లేదా పాఠశాలల నుండి గంట ముందుగా బయలుదేరడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది మార్చి 2 నుండి 2025 మార్చి 31 వరకు వర్తిస్తుంది. పవిత్ర రంజాన్ మాసం అంతా, వారు సాయంత్రం 4 గంటలకు కార్యాలయాలు లేదా పాఠశాలల నుండి బయటకు వెళ్లడానికి అనుమతి ఉంది.

బోనాల పండుగ తర్వాతి రోజు, క్రిస్మస్ పండుగ తర్వాతి రోజు, రంజాన్ పండుగ తర్వాతి రోజు గత ప్రభుత్వాల నుంచి సెలవులు ప్రకటిస్తున్నారు. అయితే అదే ఆనవాయితీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‌లోనూ కొనసాగుతోంది. ఏపీలో మాత్రం మార్చి 31వ తేదీన ఒక్కరోజే సెలవు ఉండనుంది. ఇక మార్చి 28 జమాతుల్-విదా సందర్భంగా ఆప్షనల్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించింది. అయితే రేపు మైనార్టీ విద్యాసంస్థలకు మాత్రమే సెలవు ఉంటుంది. మిగతా కాలేజీలు, స్కూళ్లు యథావిధిగా పని చేయనున్నాయి. ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేపు ప్రత్యేకంగా సెలవు తీసుకునే అవకాశం ఉంది.

Also Read: హైకోర్టును ఆశ్రయించిన టెన్త్ విద్యార్థిని.. అసలేం జరిగిందంటే?

ఒక్కరోజు మినహా..
పండుగల నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో.. విద్యాసంస్థలు ఏప్రిల్ 2న బుధవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఒక్క శనివారం(మార్చి 29) మినహా బుధవారం మైనార్టీ విద్యా సంస్థలకు వరుస సెలవులు వచ్చాయి. మిగతా వారికి మార్చి 30 ఉగాదితోపాటు.. ఆదివారం కావడం, తర్వాతి రోజు రంజాన్, ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 1న కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో.. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..