Damodar Rajanarasimha: ఆసుపత్రుల్లో కుటుంబ సభ్యుల నర్సింగ్ ఆఫీసర్లు వైద్యసేవలు అందిస్తున్నారని మంత్రి దామోదర రాజనర్సింహా(Minister Damodar Rajanarasimha) కొనియాడారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో నర్సింగ్ ఆఫీసర్లుచేసిన సేవలు మరువలేమన్నారు. విదేశాల్లోనూ నర్సింగ్ ఉద్యోగవకాశాలు పెరుగుతున్నాయన్నారు. అందుకే ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల విద్యార్థులకు జర్మన్, జపనీస్ భాషలు నేర్పించేందుకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్(English and Foreign Languages) యూనివర్సిటీతో ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. మంగళవారం ఇప్లూ, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల మధ్య ఒప్పందాలు జరిగాయి.
దేశ, విదేశాల్లో నర్సులకు..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నర్సింగ్ అనేది ప్రజల ప్రాణాలు కాపాడే పవిత్రమైన వృత్తి అని వివరించారు. నర్సులకు ఉద్యోగ(Job), ఉపాధి(Job) అవకాశాకు కల్పించే విషయంలో తమ ప్రభుత్వం నిబద్ధతో ముందుకెళ్తున్నదన్నారు. గతేడాది సుమారు 7 వేల నర్సింగ్ పోస్టులను భర్తీ చేయగా, ఈ ఏడాది మరో 2322 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇదేకాకుండా దేశ, విదేశాల్లో నర్సులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జర్మన్, జపాన్ దేశాల్లో నర్సులకు చాలా డిమాండ్ ఉన్నదన్నారు. తెలంగాణ నర్సుల్లో మంచి స్కిల్ ఉన్నప్పటికీ,జర్మన్, జపాన్ లాంగ్వేజేస్ రాకపోవడం వల్ల ఆయా దేశాల్లో ఉద్యోగాలు పొందలేకపోతున్నారన్నారు.
Also Read: Illegal Sand Mining: యథేచ్ఛగా అధికారుల అండతో.. అక్రమ మట్టి దందా?
మరో రెండు కాలేజీలు
జర్మన్(German), జపాన్(Japan) వంటి విదేశీ భాషలు నేర్పించి వారికి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇప్లూతో అగ్రిమెంట్లు చేశామన్నారు. ఒక్కో విద్యార్ధినికి సుమారు 24 వేలు ఖర్చు పెట్టి, రెండేళ్ల పాటు విదేశీ భాషల్లో ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికేట్లు అందజేస్తామన్నారు. దీని వలన విదేశాల్లోని ఉద్యోగం సాధించడంతో పాటు ఆయ నర్సింగ్ ఆఫీసర్ల కుటుంబాలు ఆర్ధికంగా నిలతొక్కుకుంటాయన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్ధులకు మేలు జరుగుతుందన్నారు. కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయగా, త్వరలో ఖమ్మం(Khammam, మదిరా(Madhira)లో మరో రెండు కాలేజీలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 76 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లు రిజిస్ట్రర్ పొంది ఉన్నారన్నారు. ఇందులో 18 వేలకు పైగా గవర్నమెంట్ లో, మిగతా వాళ్లంతా ప్రైవేట్ లో పనిచేస్తున్నారన్నారు.ఇక ఏన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న నర్సింగ్ డైరెక్టరేట్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు.
Also Read: Illegal Belt Shops: మద్యం బాటిల్ పై స్టిక్కర్ దందా.. వైన్స్ యజమానులే అధికారులా?