Uttam Kumar Reddy: చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు పనులను పునరిద్దరిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) పేర్కొన్నారు. తమ్మిడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి డి.పి.ఆర్ లు సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. నీటపారుదల శాఖా అద్వర్యంలోని ప్రాజెక్టలకు సోలార్ విద్యుత్ ను అందిస్తామన్నారు. అందుకు అనుగుణంగా నీటిపారుదల శాఖా భూములలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో నీటిపారుదల శాఖా ఇంజినీర్లతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖా ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రభుత్వ సలహాదారుడు ఆదిత్య నాధ్ దాస్, సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్ తదితరులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
పాత ప్రణాలిక ప్రకారం..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాత ప్రతిపాదన ప్రకారం తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లి ద్వారా చేవెళ్ల కు నీరు అందించే యోచన చేస్తున్నామన్నారు. తుమ్మిడిహట్టి నుండి 71 కిలోమీటర్ల మేర దూరం ఉన్న కాల్వపనులలో ఇప్పటికే 45 కిలోమీటర్ల దూరం పూర్తి అయ్యాయాన్నారు. 71 కిలోమీటర్ పాయింట్ నుండి అంటే మంచిర్యాల జిల్లా మైలారం గ్రామ సమీపం నుండి నీటిని తరలించ డానికి రెండు మార్గాలను పరిశీలిస్తున్నామన్నారు. అందులో మొదటిది పాత ప్రణాలిక ప్రకారం మైలారం నుండి ఎల్లంపల్లి రిజర్వాయర్ వరకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఒక లిఫ్ట్ అవసరం ఉంటుందని గుర్తించామన్నారు. రెండోది అదే పాయింట్ నుండి సుందిళ్ల బ్యారేజ్ వరకు సుమారు 55 కిలోమీటర్ల దూరం వరద కాలువ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉందన్నారు. రెండు మార్గాలు కుడా ఆర్థికంగా భారం కాకుండా తక్కువ ఖర్చుతో అయ్యేలా అధికారులు ప్రతిపాదించారంన్నారు. అధికారుల ప్రతిపాదనలకు ఆయాన స్పందిస్తూ రెండు మార్గాలకు సంబంధించిన డి.పి.ఆర్ లను సిద్ధం చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
Also Read: MBBS Seats: వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలో మరో 175 ఎంబీబీఎస్ సీట్లు?
ప్రాజెక్టులకు సోలార్ విద్యుత్..
ఇదే విషయంపై వారం రోజుల్లో ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. సవరించిన డి.పి.ఆర్(DPR) లను అక్టోబర్ మాసంతానికి సిద్ధం చేయాలన్నారు అదే విదంగా నీటిపారుదల శాఖకు చెందిన భూముల్లో సోలార్ విద్యుత్(Solar electricity) ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఇక పై విద్యుత్ తో నడిచే నీటిపారుదల శాఖా ప్రాజెక్టులకు సోలార్ విద్యుత్ ను వినోయోగించే విదంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎత్తిపోతల పధకాలకు సోలార్ విద్యుత్ ను వినియోగించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించు కోవొచ్చని ఆయన చెప్పారు. అందుకు నీటిపారుదల శాఖా భూములలో సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేయడం ద్వారా ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించుకోవొచ్చన్నారు. అదే విదంగా దేవాదుల ప్యాకేజ్ 3, కల్వకుర్తి ప్యాకేజీ 29, పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజ్ 7,ఎస్.ఎల్.బి.సి టన్నెల్ తదితర ప్రాజెక్టు పనులపై ఆయన సమీక్షించారు ఎస్.ఎల్.బి.సి(SLBC) పనుల పునరుద్ధరణకు గాను ఏరియల్ సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచాడం,బనకచర్ల ప్రాజెక్టు అంశాలపై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: Inspirational Story: సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసి.. అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యాడు
