TGSRTC Samme: తెలంగాణ ఆర్టీసీలో (TGSRTC) సమ్మె సైరన్ మోగింది. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మె నిర్వహించనున్నట్లు ఆర్టీసీ జేఏసీ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar), లేబర్ కమిషనర్ కు సైతం సమ్మె నోటీసులను జేఏసీ నేతలు అందజేశారు. అయితే సమస్యల పరిష్కారానికి జనవరి 27వ తేదీనే నోటీసులు ఇచ్చామని జేఏసీ నేతలు (RTC JAC) తెలిపారు. కానీ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చినట్లు స్పష్టం చేశారు.
మే 7వ తేదీన మెుదటి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ ఉద్యోగులు విధులను బహిష్కరించనున్నట్లు జేఏసీ నేతలు తెలియజేశారు. తమ నిరసనలకు ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం, ఆర్టీసీ ఆశించిన స్పందన లేకపోవడంతోనే సమ్మెకు పిలుపునిచ్చామని.. తమ నిరసనల్లో ఏదైనా జరిగితే దానికి వారే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
Also Read: LPG Cylinder Gas Price: బాదుడు చమురుపై కాదట.. గ్యాస్ పైనేనట.. కేంద్రం క్లారిటీ
ఆర్టీసీలోని ఖాళీలను భర్తీ చేసి.. ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని జేఏసీ నేతలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే వేతన సవరణ, అలవెన్సుల పెంపు, మహాలక్ష్మీ పథకం బకాయిల చెల్లింపు, కారుణ్య నియమాకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. వాటి పరిష్కారానికి డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు.