TG TET 2025 ( Image Source: Twitter)
తెలంగాణ

TG TET 2025: ముగిసిన ‘టెట్’ పరీక్షలు.. వచ్చేనెల 5న ప్రిలిమినరీ కీ విడుదల

TG TET 2025: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు సోమవారంతో ముగిశాయి. జూన్ 18 నుంచి 30 వరకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 66 కేంద్రాల్లో 16 సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించారు. కాగా పేపర్ 1 కోసం మొత్తం 63,261 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 47,224 మంది హాజరైనట్లు టీజీ టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ తెలిపారు. పేపర్ 2 గణితం, సైన్స్ విభాగానికి 66,686 మంది దరఖాస్తు చేసుకోగా 48,998 మంది హాజరయ్యారు. సోషల్ స్టడీస్ విభాగానికి 53,706 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా 41,207 మంది హాజరైనట్లు తెలిపారు. కాగా జూలై 5వ తేదీన ప్రిలిమినరీ కీని విడుదల చేయనున్నట్లు ఆయన స్పస్టంచేశారు.

Also Read: Congress vs BJP: డీఎస్ విగ్రహావిష్కరణపై వార్.. దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్.. ఎందుకంటే?

కాగా అభ్యంతరాలను జూలై 5 నుంచి అదే నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యంతరాలను సమర్పించడానికి, అభ్యర్థులు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఫైనల్ కీని విడుదల చేయనున్నారు. ఆ తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నారు.

Also Read: Star Actress: నా లైఫ్‌లో అతిపెద్ద నమ్మకద్రోహం అదే.. లవరే కాలయముడు అయ్యాడు.. స్టార్ నటి!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!