Telangana Health: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థో సమస్యల పేషెంట్లు పెరుగుతున్నారు. బోన్స్ ప్రాబ్లమ్స్ తో చాలా మంది బాధితులు సతమతం అవుతున్నారు. ఏప్రిల్ 2022 నుంచి జూన్ 2025 వరకు 1,61,604 మంది ఆర్థో సమస్యలతో తమ స్పెషలిస్టులను సంప్రదించినట్లు టెలీ మెడిసిన్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు తెలిపారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలీ, ఎముకలపై ఒత్తిడి పడేలా వ్యవహరించడం వంటి అంశాలు ఆర్థో సమస్యలకు ప్రధాన కారణంగా మారుతున్నట్లు ఆర్థోపెడిక్ డాక్టర్లు చెప్తున్నారు.
Also Read: War 2 Record:మరో ఘనత సాధించిన ఎన్టీఆర్ సినిమా
ఇక అత్యధిక పేషెంట్లు జనరల్ మెడిసిన్ విభాగానికి 4,11,304 మంది సంప్రదించగా, గైనిక్ సమస్యలతో 3,01,949 మంది మహిళలు గైనకాలజిస్టులను సంప్రదించారు. డయాబెటిక్,(Diabetic) డెర్మటాలజీ విభాగాలకు చెరో లక్ష మందికి పైగా పేషెంట్లు చొప్పున స్పెషలిస్టు డాక్టర్లు సంప్రదించినట్లు నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా అమలు చేస్తున్న ఈ–సంజీవని టెలీ మెడిసిన్ స్పెషల్ రిపోర్టులో పొందుపరిచారు. ఇక పీడియాట్రిక్ విభాగానికి 1,91,674 మంది ఈఎన్ టీ కి 1,12,462 మంది, చొప్పున అత్యధికంగా పేషెంట్లు సంప్రదించినట్లు టెలీ మెడిసిన్ డాక్టర్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 స్పెషలిస్టు విభాగాలకు ఏకంగా 17,57,925 మంది పేషెంట్లు వైద్యసేవలు పొందినట్లు స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ…?
టెలీ మెడిసిన్ విభాగం ద్వారా నిజామాబాద్ జిల్లా నుంచే ఎక్కువ మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ 2022 నుంచి జూన్ 2025 వరకు 1,29,111 మంది అత్యధికంగా ట్రీట్మెంట్ తీసుకోగా, యాదాద్రి భువనగిరిలో 1,20,568 మంది, నాగర్ కర్నూల్ లో 1,16,019 మంది, హైదరాబాద్ లో 1,0,5098 మంది స్పెషలిస్టు సేవలు కోసం అత్యధికంగా డాక్టర్లను సంప్రదించారు. ఇక జనరల్ కన్సల్టెన్సీ విభాగంలో అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఏకంగా 20,55,482 మంది, నిజామాబాద్ లో 17,55,685 మంది, నల్లగొండ జిల్లాలో 15,25,024 మంది, భద్రాద్రి కొత్తగూడెంలో 14,47,724 మంది పేషెంట్లు టెలీ మెడిసిన్ ద్వారా వైద్యసేవలు పొందారు.
టెలీ మెడిసిన్ కు పుల్ డిమాండ్…
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2018లో టెలీ మెడిసిన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. మన స్టేట్ లో 2022 నుంచి పూర్తి స్థాయిలో ప్రోగ్రామ్ ను అమలు చేశారు.వెయ్యి ప్రజల వద్దకే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలుఅంటూ నిర్వహిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వీడియో కన్సల్టెన్సీ ప్రోగ్రామ్ ను అమలు చేస్తున్నారు. జనరల్ మెడిసిన్ నుంచి కార్డియాలజీ వరకూ 20 రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. 77 హబ్స్ ద్వారా స్పెషలిస్టు డాక్టర్లు షిప్టుల వారీగా టెలీ మెడిసిన్ సేవలు అందిస్తున్నారు. గతేడాది 6 లక్షల మంది పేషెంట్లకు వీడియో కన్సల్టెన్సీ ద్వారా స్పెషలిస్టుల వైద్యం అందించారు.
తాజాగా రాష్ట్రంలో సంపూర్ణంగా జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ పై కేంద్ర ప్రభుత్వం కూడా అభినందనలు తెలిపింది.ఏజెన్సీ ఏరియాల్లో ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఆదిలాబాద్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, తదితర గిరిజన ప్రాంతాల్లో స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నుంచే టెలీ మెడిసిన్ ద్వారా జనరల్, స్పెషలిస్టు వైద్యసేవలను పొందే వెలుసుబాటు ఉన్నది. హాలో డాక్టర్ అని సమస్య వివరిస్తే..ఆన్ లైన్ విధానంలో సొల్యూషన్ తో పాటు మెడిసిన్స్ ను రిఫర్ చేయడం గమనార్హం.
Also Read: TS News: ఖమ్మం కలెక్టరేట్‌లో డ్రైవర్.. ఎవరూ ఊహించని పనులు!