Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి జీరో-ఎమిషన్ మొబిలిటీలో దేశానికి దిక్సూచీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గ్లోబల్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్-2047లో పాల్గొన్న ఆయన, రాష్ట్ర రవాణా రంగంలో తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలను వివరించారు. క్లీన్ మొబిలిటీని కేవలం పర్యావరణ లక్ష్యంగా కాకుండా, ప్రజారోగ్యం, ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రత, పట్టణ నివాసయోగ్యతకు ప్రాధాన్యంగా చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేయడానికి, తెలంగాణ దేశంలోనే అత్యంత ఉదారమైన ఈవీ ప్రోత్సాహక విధానాలను అమలు చేస్తోంది. డిసెంబర్ 31, 2026 వరకు అన్ని ఈవీలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ 100% మినహాయింపు మంజూరు చేశారు. ఈ పాలసీతో ఈవీ వాహనాల అమ్మకాలు డిసెంబర్ 2023లో 0.60% నుంచి నవంబర్ 2025 నాటికి 1.39%కి పెరిగాయి. ఇప్పటివరకు 1,59,304 ఈవీ వాహనాలకు రూ.806.85 కోట్ల విలువైన పన్ను రాయితీలు ఇచ్చామని మంత్రి వెల్లడించారు.
Also Read: Telangana: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం
296 కోట్లతో ఏటీఎస్ సెంటర్లు
‘సురక్షితమైన, స్మార్ట్, పారదర్శకమైన రవాణా పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో భాగంగా, ప్రభుత్వం అత్యాధునిక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను (ఏటీఎస్) ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో జిల్లాకు ఒకటి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో నాలుగు ఉంటాయి. ఈ ఏటీఎస్ సెంటర్ల ఏర్పాటుకు రూ.296 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చారు. ఇవి వాహన ఫిట్‌నెస్ పరీక్షకు శాస్త్రీయ ఖచ్చితత్వాన్ని తీసుకువస్తాయని, రహదారి భద్రతను మెరుగుపరుస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు క్లీన్ లాస్ట్ మైల్ అర్బన్ మొబిలిటీ- ఓఆర్ఆర్ ఆటో రిఫార్మ్ తీసుకొస్తున్నాం. 20వేల ఎలక్ట్రిక్ ఆటోలు, 10వేల సీఎన్‌జీ ఆటోలు, 10వేల ఎల్పీజీ ఆటోలు, 25వేల రెట్రో-ఫిటెడ్ ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి ఇస్తున్నాం. ఓఆర్‌ఆర్ లోపల డీజిల్, పెట్రోల్ ఆటో పర్మిట్లు, ఒక్కొక్కరికి ఒక పర్మిట్ మాత్రమే అనుమతి’ ఉంటుందని మంత్రి వివరించారు. వాహన స్క్రాపేజ్ పాలసీని వేగవంతం చేస్తూ, గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు, పెండింగ్ జరిమానాల మినహాయింపుతో పాటు, పాత వాహనాలను స్క్రాప్ చేసి కొత్తవి కొంటే పన్నురాయితీ ఇస్తున్నారు. రాష్ట్రంలో 3 రిజిస్టర్డ్ వెహికల్ స్
Also Read: Meta Phoenix Launch: మరోసారి వాయిదా పడిన మెటా ఫీనిక్స్ MR గ్లాసెస్ .. 2026 లో కూడా లేనట్లేనా?

