Election Commission: రాష్ట్రంలో నమోదైన 10 గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్షన్‌రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాటి కార్యకలాపాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, అక్టోబర్ 10లోపు సమాధానం ఇవ్వకపోతే గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. సెప్టెంబర్ 19న ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను నోటీసులు అందజేయాలని, జాతీయ–స్థానిక పత్రికలలో ప్రచురణతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.
పార్టీలు ఎమిటంటే..?
బహుజన రాష్ట్ర సమితి (హైదరాబాద్), ఇండియన్ రక్షక నాయకుడు పార్టీ (నారాయణపేట), జై మహా భారత్ పార్టీ (జోగులాంబ గద్వాల్), జై స్వరాజ్ పార్టీ (రంగారెడ్డి), మజ్లిస్ మార్కజ్-ఏ-సియాసీ పార్టీ (హైదరాబాద్), నవ ప్రజా రాజ్యం పార్టీ (ఆదిలాబాద్), న్యూ ఇండియా పార్టీ (పెద్దపల్లి), ప్రజా స్వరాజ్ పార్టీ (రంగారెడ్డి), శ్రమజీవి పార్టీ (మేడ్చల్-మల్కాజిగిరి), తెలంగాణ ఇంటి పార్టీ (నల్గొండ) పార్టీలు వివరణ ఇవ్వాలని కోరారు. సంబంధిత అధికారులు నిర్దిష్ట ఫార్మాట్‌లో సవివరమైన నివేదికలు తయారు చేసి, ఈ పార్టీలు కొనసాగించాలా లేదా గుర్తింపు రద్దు చేయాలా అన్న దానిపై స్పష్టమైన సిఫారసులు ఇవ్వాలని సీఎస్‌ఈఓ(CSEO) ఆదేశించారు.ఈ నివేదికలు తప్పనిసరిగా అక్టోబర్ 10, 2025లోపు సమర్పించాలని, ఆ తర్వాత ఎన్నికల సంఘానికి పంపించనున్నట్లు పేర్కొన్నారు.
Also Read: Phone Tapping Case: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి?
CSEO ఆదేశాల ప్రకారం
CSEO ఆదేశాల ప్రకారం, అధికారులు నియమించుకున్న పార్టీలపై నిర్దిష్ట పద్దతిలో నివేదికలు సిద్ధం చేసి, అవి పార్టీలు కొనసాగించాలా లేదంటే గుర్తింపు రద్దు చేయాలా అన్న సిఫారసులు తెలుపుతుంది. ఓకవేల నివేదికలు సమర్పించకుంటే, ఎన్నికల సంఘం వాటిపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ పద్దతి ద్వారా తెలంగాణలో గుర్తింపు లేని పార్టీలు, ఎన్నికల ప్రక్రియను పాటిస్తున్నారా లేదా అనే అంశంపై స్పష్టత వస్తుంది. రాష్ట్రంలోని ప్రజలకు న్యాయపరమైన, పారదర్శకమైన ఎన్నికల వాతావరణంను ఏర్పరచడంలో ఇది ఈ సంస్ధ చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందని అధికారులు పేర్కొంటారు.
Also Read: Crime News: మేనమామను హత్య చేసిన మహిళ.. అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎక్కడంటే..?