Minister Sridhar Babu: హెచ్1 బీ వీసా ఛార్జీలను పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీసుకున్న నిర్ణయం తెలంగాణకు, భారతీయ టెక్ కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) తెలిపారు. హెచ్ 1 బీ వీసాపై చార్జీలు అమెరికా పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండిస్తుందన్నారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. హెచ్ 1 బీ వీసాపై ట్రంప్ నిర్ణయంపై తెలంగాణ యువతకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు నడిపిస్తున్న వారికి అమెరికా నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అమెరికా నిర్ణయాల పై భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది? అని నిలదీశారు. లక్ష డాలర్లు కట్టాలని అమెరికా రూల్ తెస్తే అమెరికాలో ఇండియా కంపెనీలకు తీవ్రమైన నష్టం కలుగుతుందన్నారు. హెచ్ 1 బీ వీసా లో మొదటి స్థానంలో ఇండియా, తర్వాత చైనా ఉందన్నారు. ట్రంప్ నిర్ణయాల పై కేంద్ర ప్రభుత్వం సైలెంట్ గా ఉండటం కరెక్ట్ కాదన్నారు. అమెరికా నిర్ణయాల వల్ల మన దేశ పౌరులకు నష్టం జరిగినా ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు.
రాష్ట్రం నుంచి అమెరికాలో చాలా మంది
హెచ్ 1బీ వీసా దారులకు తాత్కాలిక ఉపశమనం కలిగే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ(Telangana) రాష్ట్రం నుంచి అమెరికాలో చాలా మంది ఉన్నారని, ఇక్కడ కుటుంబాలు వాళ్ళు పంపించే మనీ పైనే ఉంటుందన్నారు. టీసీఎస్ లక్ష మంది, విప్రో 80 వేలు, ఇన్ఫోసిస్ 60 వేలు అమెరికాలో ఉన్నారని, ట్రంప్ నిర్ణయం టాలెంట్ కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అంటూ అక్కడ వ్యాపారవేత్తలు వ్యతిరేకిస్తున్నారన్నారు. ట్రంప్ నిర్ణయం పై కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. దౌత్యపరంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇండియాకు నష్టం జరుగుతుందన్నారు.
Also Read: Sunitha Laxma Reddy: రాష్ట్రంలో కులాలకు అతీతంగా ఆడుకునే పండుగ బతుకమ్మ!
ట్రంప్ నిర్ణయం పెనుభారం
ట్రంప్ నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాలకు పెద్ద ప్రమాదం పొంచివుందన్నారు. అమెరికా వెళ్ళాలి అనే యువతకు ట్రంప్ నిర్ణయం పెనుభారం అన్నారు. ట్రంప్ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం పడుతుందన్నారు. రియల్ ఎస్టేట్, బంగారం కొనుగోలు, ఇతరుల రంగాల్లో భారం పడుతుందని, ట్రంప్ నిర్ణయంపై కేంద్రం మోడీ మౌనం వెనుక ఉన్న అంతర్యం ఏంటి? అన్నారు. మోడీ – ట్రంప్ స్నేహం బాగుంది అంటారు..కానీ ఈ నిర్ణయాలు ఏంటో చెప్పాలన్నారు. చిన్న, మధ్యతరగతి కంపెనీల గురించి కేంద్రం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Kona Venkat: కోన వెంకట్ ‘ది రాజా సాబ్’ ట్రైలర్ రివ్యూ.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే!